టీడీపీ, జనసేన.. మేనిఫెస్టో కన్ఫ్యూజన్ !

ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు( TDP ) రెండు కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇరు పార్టీల అధినేతలు ఇప్పటికే ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు కూడా.

త్వరలో సీట్ల పంపకాల విషయంలో కూడా క్లారిటీ రానుంధి.అయితే పొత్తు కన్ఫర్మ్ అయినప్పటికి ఒక్క విషయంలో మాత్రం రెండు పార్టీలు కన్ఫ్యూజన్ లో పడ్డాయట అదే మేనిఫెస్టో అంశం.

రెండు పార్టీలు కలిసి మేనిఫెస్టో రూపకల్పనా చేయాలా లేదా ఎవరికి వారు మేనిఫెస్టో ప్రకటించాలా ? అనే దానిపై అటు టీడీపీ ఇటు జనసేన నిర్ణయం తీసుకులేక పోతున్నాయట.

మేనిఫెస్టో విషయంలో టీడీపీ కొంత ముందుంది.ఇప్పటికే మినీ మేనిఫెస్టో రూపంలో కొన్ని హామీలను ప్రకటించింది తెలుగుదేశంఆ పార్టీ.త్వరలో పూర్తి మేనిఫెస్టోను ప్రజల ముందుంచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

ప్రస్తుతం అధినేత చంద్రబాబు అరెస్ట్ తో సతమతమౌతున్న టీడీపీ.త్వరలో అన్నీ సమస్యలను క్రియర్ చేసుకొని దసరాకు పూర్తి మేనిఫెస్టో ప్రకటించేందుకు సిద్దమౌతోందట.

అటు జనసేన పార్టీ ఇంకా మేనిఫెస్టోపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.పలు హామీలను పవన్ ప్రకటిస్తున్నప్పటికి ఆ హామీలు మేనిఫెస్టోలో ఉంటాయా లేదా అన్నది సందేహమే.

ఇక పోతే వాలెంటర్ల విషయానికొస్తే వాలెంటరీ వ్యవస్థ( Volunteers )ను టీడీపీ సమర్థిస్తోంది.తాము అధికారంలోకి వచ్చిన వాలెంటరీ వ్యవష్ట కొనసాగుతుందని నారా లోకేశ్, చంద్రబాబు నాయుడు గతంలోనే ప్రకటించారు.కానీ పవన్( Pawan kalyan ) మాత్రం వాలెంటరీ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇక కొన్ని విషయాల్లో రెండు పార్టీల మద్య అసంబద్దత నెలకొంది.ఏ ఏ అంశాలను మేనిఫెస్టోలో చేర్చుతారు ? అసలు మేనిఫెస్టో విషయంలో కలిసి అడుగేసే అవకాశం ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.మరి ప్రస్తుతం పొత్తు కన్ఫర్మ్ కాగా మిగిలిన విషయాలపై మెల్లగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

మరి టీడీపీ, జనసేన ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకు వస్తాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు