ఈనెల 4న టీడీఎల్పీ సమావేశం

ఈ నెల 4వ తేదీన టీడీఎల్పీ సమావేశం( TDLP Meeting ) జరగనుంది.

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించనున్న ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

అదేవిధంగా రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే అంశంపై చంద్రబాబు( TDP Leader Chandrababu Naidu ) సభ్యుల అభిప్రాయాలను తీసుకోనున్నారు.

దాంతోపాటుగా రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్లు, గంటా శ్రీనివాస్ రావు రాజీనామా( Ganta Srinivasa Rao Resign ) ఆమోదంతో పాటు స్పీకర్ వ్యవహార శైలి వంటి పలు అంశాలపై టీడీఎల్పీలో ప్రస్తావించనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం తీరుపై సభలో నిరసన తెలిపే విధంగా టీడీఎల్పీ ప్రణాళికలు సిద్ధం చేయనుందని సమాచారం.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు