వింత జరిమానా! చొక్కా గుండీలు పెట్టుకోలేదని

కొత్త వాహన చట్టం ఏమో గాని వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఎప్పుడు ఎలాంటి చట్టం గురించి చెప్పి ఫైన్ విధిస్తారో తెలియక జనాలు రోడ్ల పైకి వస్తున్నారు.

ఎదో వాహనానికి సంబందించిన పేపర్స్,లేదంటే హెల్మెట్ లేకపోవడం తో భారీ జరిమానాలు విధిస్తే పరలేదు.కానీ టూ వీలర్స్ చెప్పులు వేసుకోకూడదు అంటూ ఒక రూల్ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా మరో వింతైన ఫైన్ వేశారు.ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ జరిమానా దేనికి విధించారో తెలుసా.చొక్కా కు గుండీలు పెట్టుకోలేదని ఒక టాక్సీ డ్రైవర్ కు చలానా రాసి చేతిలో పెట్టినట్లు తెలుస్తుంది.

Advertisement

ఈ ఘటన వెలుగులోకి రావడం తో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.ఈ ఘటన జైపూర్ లో చోటుచేసుకుంది.

చెప్పులు వేసుకుని.చొక్కాకు గుండీలు పెట్టుకోలేదని ఓ ట్యాక్సీ డ్రైవర్‌కు చలానా రాసి చేతిలో పెట్టారు పోలీసులు.

దీంతో ట్యాక్సీ డ్రైవర్‌ నోట మాటరాని పరిస్థితి.అయితే, జరిమానా ఎంత చెల్లించాలనేది కోర్టు చూసుకుటుందని సదరు పోలీసులు సెలవిచ్చారు.

ఈ నెల 6వ తేదీన ఈ ఘటన జరిగినా కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది.అన్నీ ఉన్నా ఏదో సాకుతో చలానాలు రాస్తున్నారంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ఇక, అర్థంపర్థం లేకుండా జరిమానాలు విధిస్తూ వేధిస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు.అయినప్పటికీ కూడా ఇలాంటి కొత్త చట్టాలతో ప్రజలు మాత్రం నానా అగచాట్లు పడాల్సి వస్తుంది.

Advertisement

తాజా వార్తలు