రీమేక్‌తో రీ ఎంట్రీ ప్రయత్నం

ఎన్నో సినిమాల్లో బాల నటుడిగా నటించి మెప్పించి ‘నువ్వే కావాలి’తో హీరోగా సక్సెస్‌ను సాధించిన తరుణ్‌ ఆ తర్వాత పలు సినిమాలతో ఆకట్టుకున్నాడు.

ఈయన నటించిన సినిమాలు వరుసగా సక్సెస్‌లు అవ్వడంతో ఈయన క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగి పోయింది.

ఎంత వేగంగా స్టార్‌గా ఎదిగాడో అంతే వేగంగా తరుణ్‌ కిందికి పడి పోయాడు.ఈయన నటించిన ఒక్కో సినిమా ఫ్లాప్‌ను చవి చూడటంతో ఈయనకు క్రేజ్‌ తగ్గి పోయింది.

దాంతో సినిమాల అవకాశాలే లేకుండా పోయాయి.దాంతో కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ ఏవో వ్యాపారాలు చేస్తే ఉన్న తరుణ్‌ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.

కన్నడంలో సూపర్‌ హిట్‌ అయిన ‘సింపుల్‌ అగి ఓధ్‌ లవ్‌స్టోరీ’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలని ఈయన భావిస్తున్నాడు.యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెరకెక్కిన ఆ సినిమాకు సుని దర్శకత్వం వహించాడు.

Advertisement

తెలుగు రీమేక్‌కు సైతం ఈయనే దర్శకత్వం వహించే ఛాన్స్‌ ఉంది.ప్రసుత్తం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈ రీ ఎంట్రీతో ఈయన మరోసారి తెలుగులో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని తహతహలాడుతున్నాడు.మరి ఈయన మునుపటి ఫాంతో దూసుకు పోతాడా లేక మొత్తానికి ఈ సినిమా తర్వాత ఫుల్‌ స్టాప్‌ పెడతాడో చూడాలి.

తరుణ్‌ త్వరలో ఈ రీమేక్‌ గురించిన అధికారిక ప్రకటన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సూపర్ హిట్ సినిమాల్లో మొదట అనుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

Advertisement

తాజా వార్తలు