గ్రహాంతర వాసిగా తాప్సీ... త్వరలోనే ప్రకటన?

టాలీవుడ్ సినీనటి సొట్ట బుగ్గల సుందరి తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

అంతే కాకుండా తమిళంలో కూడా నటించింది ఈ బ్యూటీ.

ఎన్నో సినిమాలలో నటించి తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.స్టార్ హీరోల సరసన కూడా నటించింది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టింది.

ఇక బాలీవుడ్ లో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల పై దృష్టి పెట్టింది.ఇక ప్రస్తుతం ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో కీలక పాత్రలో నటిస్తోంది.

Advertisement

అంతేకాకుండా శభాష్ మిథు అనే సినిమాలో కూడా బిజీగా ఉంది.ఇక హసీన్ దిల్ రూబా సినిమాలో నటించగా త్వరలోనే విడుదల కానుంది.

ఇక ఇవే కాకుండా రష్మీ రాకెట్, లూప్ ల పేటా సినిమాలలో కూడా నటిస్తుంది.ఇక మరో సినిమాలో నటించనుండగా అందులో గ్రహాంతరవాసిగా కనిపించనుందట.

భరత్ నీలకంఠన్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు తెలిసింది.ఇక ఆ సినిమా గ్రహాంతర వాసులు నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ కథలో తెరకెక్కనుందట.ఇక ఈ సినిమాకు ఏలియన్అనే పేరును కూడా అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాను హాలీవుడ్ ఏలియన్స్ పరంగా కాకుండా కాస్త కొత్తగా కనిపించనున్నట్లు సమాచారం. భారతదేశంలో ఎలియన్స్ ఉంటే ఎలా ఉంటుందో ఆ కథ విధంగా తెరకెక్కనుందని తెలుస్తుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకున్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట.అంతే కాకుండా ఎక్కువ భాషల్లో కూడా ఈ సినిమాను పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

Advertisement

మొత్తానికి ఈ సినిమాను డైరెక్టర్ భరత్ నీలకంఠన్ కాస్త కొత్తదనాన్ని జోడించి రూపొందించనున్నట్లు తెలియగా ఈ సినిమాలో తాప్సీ ఎలా కనిపించిందో హాట్ టాపిక్ గా మారింది.ఇక ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.

తాజా వార్తలు