రూమర్స్ ఆపెయ్యండి ప్లీజ్ అంటున్న తాప్సి

నందమూరి బాలకృష్ణతో జోడికట్టబోతున్న తాప్సి .ఓ తెలుగు ఛానెల్ కథనం.

బాలకృష్ణ వందొవ చిత్రంలో తాప్సి .ఒక తెలుగు వెబ్ సైట్ ఆర్టికల్.విషయం తాప్సి దాకా వెళ్ళింది.

ఇంకేముంది సదరు వెబ్ సైట్ కి ట్విట్టర్లోనే బదులిచ్చింది తాప్సి.ఈ గాలివార్తలు ఆపెయ్యండి ప్లీజ్ అని.బాలకృష్ణ - సింగీతం శ్రీనివాస్ కాంబినేషన్లో ఆదిత్య 369 కి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే.ఇది బాలకృష్ణకి వందొవ చిత్రం అన్న సంగతి విదితమే.

ఇంకా నిర్మాత, హీరోయిన్ ఫిక్స్ కాని ఈ చిత్రానికి తాప్సిని అంటించాయి కొన్ని ఛానెళ్లు, వెబ్ సైట్లు.దాంతో తాప్సి ఇలా వేడుకోవాల్సి వచ్చింది.ప్రస్తుతం తాప్సి రానాతో ఘజి, అమితాబ్ బచ్చన్ - సుజీత్ సర్కార్ కాంబినేషన్లో ఓ చిత్రం, అక్షయ్ కుమార్ సరసన కత్తి రీమేక్ లో నటిస్తోంది.

Advertisement
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

తాజా వార్తలు