Chiranjeevi : ఆపరేషన్ తర్వాత మొదటి చిరంజీవిని చూడలన్న చిన్నారి.. చిరు ఏం చేశారంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తాజాగా పద్మ విభూషణ్ అవార్డు( Padma Vibhushan ) వహించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి పేరు మారుమోగిపోతోంది.

ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపగా ఇంకొందరు నేరుగా ఆయన ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.సినీ కళామతల్లికి ఆయన అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌ పురస్కారంతో సత్కరించనుంది.2006లోనే చిరంజీవికి పద్మ భూషణ్ అవార్డు వచ్చింది.ఇప్పుడు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారాన్నిఅందుకోనున్నారు.

స్వయంకృషితో సినీ పరిశ్రమలో ఎదిగిన చిరంజీవికి పద్మవిభూషణ్‌ రావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు.దర్శక నిర్మాతలు, హీరోలు చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ ఆయనను సత్కరిస్తున్నారు.అభినందనలు తెలుపుతున్నారు.

ఒక నటుడిగా చిరంజీవిని పక్కన పెడితే ఆపదలో ఉన్నవారికి ఆయన ఆపద్బాంధవుడు.కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ సహాయం చేసే గొప్ప మనసు మెగాస్టార్‌ది.

Advertisement

చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌( Chiranjeevi Charitable Trust ), బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ ఇలా చిరంజీవి సేవా గుణానికి ప్రత్యక్ష నిదర్శనాలు.కరోనా మహమ్మారి సమయంలో కూడా పనుల్లేక సినీ శ్రామికులు ఇబ్బందులు పడితే సీసీసీ పేరుతో అందరికీ నిత్యావసర సరుకులు అందజేశారు.

అలాగే ఆక్సిజన్‌ సిలిండర్లను ఉచితంగా అందజేశారు.చిరంజీవి సేవా కార్యక్రమాల్లో ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే.మెగాస్టార్‌ చేసిన సహాయం, మేలు, దానాల గురించి అప్పుడప్పుడూ స్వయంగా సినీ ప్రముఖులే అందరితో పంచుకుంటుంటారు.

తాజగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి( Tammareddy bharadwaj )  చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందట.

ఒక చిన్నారి తన కంటి ఆపరేషన్ చేయించుకుందట.అయితే కంటి చూపు తర్వాత ఆ సినిమా తాను కళ్లు తెరిస్తే మొదటగా మెగాస్టార్‌ చిరంజీవినే చూడాలని కోరుకుందట.అయితే కేంద్ర మంత్రి హోదాలో ఉన్న చిరంజీవి చిన్నారి కోసం? వస్తారా? లేదా? అని తమ్మారెడ్డి అనుకున్నారట.ఫోన్ చేసి విషయం చెప్పాను.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఆయన వస్తాను అన్నారు.డేట్ కూడా చెప్పమని అడిగారు.

Advertisement

చెప్పిన సమయానికి ఆయన వచ్చేశారు.ఆ పాప కళ్లు తెరిచే సరికి చిరంజీవి ముందు నిల్చున్నారు అంటూ తమ్మారెడ్డి అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ప్రస్తుతం తమ్మారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన నెట్టింట వైరల్ గా మారాయి.

తాజా వార్తలు