ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.రామ్ చరణ్ ప్రస్తుత సినిమాలన్నీ కూడా ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాయి.
రామ్ చరణ్ ప్రస్తుత శంకర్(Shankar) దర్శకత్వంలో గేమ్ చేంజెర్ (Game Changer)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు.ఈ సినిమా దాదాపు 70 శాతం సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.
ఇక రామ్ చరణ్ హీరోగా సినిమాలలో నటిస్తూనే నిర్మాతగా కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఈయన కొనదెల ప్రొడక్షన్ బ్యానర్ (Konidela Production)ను స్థాపించి ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే.

ఇక రాంచరణ్ కోసం సొంత బ్యానర్ ఉన్నప్పటికీ ఈయన మరొక కొత్త బ్యానర్ తో కలిసి సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు.రామ్ చరణ్ సరికొత్త ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్(UV Creations) వారితో కలిసి స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.వి మెగా క్రియేషన్స్ లో అయితే పలు ఆసక్తికర సినిమాలు తీసుకురానుండగా ఇప్పుడు ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ఓ యంగ్ హీరోతో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.అయితే రామ్ చరణ్ అక్కినేని అఖిల్ కు సపోర్ట్ గా తన ఈ కొత్త బ్యానర్ లో సినిమా చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం అఖిల్ (Akhil)తో కాకుండా చరణ్ హీరో నిఖిల్ (Nikhil)తో కలిసి సినిమా చేస్తున్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి.ఆల్రెడీ నిఖిల్ కార్తికేయ 2 తో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి మార్కెట్ కైవసం చేసుకున్నారు.ఈ క్రమంలోనే రామ్ చరణ్ కొత్త బ్యానర్ లో నిఖిల్ హీరోగా సినిమా చేయాలన్న ఆలోచనలు ఉన్నారని తెలుస్తుంది.త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలను అధికారకంగా తెలియజేయబోతున్నారు.
రామ్ చరణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతూనే మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు.