ఆరోజు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు.. ఇప్పుడు రికార్డ్ స్థాయి ఆర్డర్లు.. స్విగ్గీ సీఈవో సక్సెస్ స్టోరీ ఇదే!

ప్రతి ఒక్కరి సక్సెస్ ఎంతోమందిలో స్పూర్తి నింపుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.స్విగ్గీని( Swiggy ) స్థాపించి పది సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో ఈ సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు శ్రీ హర్ష మాజేటి( Sriharsha Majety ) సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

2014 సంవత్సరం అగష్టు 6వ తేదీన మేము స్విగ్గీని ప్రారంభించామని ఆయన చెప్పుకొచ్చారు.ఆరోజు ఫుడ్ ఆర్డర్( Food Order ) ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశామని ఆయన చెప్పుకొచ్చారు.

మరుసటి రోజు మాకు తొలి ఆర్డర్ వచ్చిందని అదే మా ప్రయాణంలో అసలైన ఆరంభానికి గుర్తు అని శ్రీహర్ష తెలిపారు.ట్రపుల్స్ రెస్టారెంట్ నుంచి రెండు ఆర్డర్లు వచ్చాయని అప్పటినుంచి వారితో బంధం బలపడిందని ఆయన చెప్పుకొచ్చారు.

ఒక దశలో ఒక్కరోజులో 7261 ఆర్డర్లను సైతం అందుకున్నామని శ్రీహర్ష వెల్లడించారు.ప్రస్తుతం ఈ సంస్థకు రికార్డ్ స్థాయిలో ఆర్డర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.

Advertisement

ప్రస్తుతం స్విగ్గీ ఏకంగా మూడు లక్షలకు పైగా రెస్టారెంట్లతో కలిసి పని చేస్తోందని శ్రీహర్ష చెప్పుకొచ్చారు.శ్రీ హర్ష మాజేటి, నందన్ రెడ్డి, రాహుల్ భాగస్వామ్యంలో 2014 సంవత్సరంలో స్విగ్గీ ప్రారంభం కాగా ప్రస్తుతం దేశంలోని 600 నగరాలలో స్విగ్గీ అందుబాటులో ఉంది.రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.

ప్రస్తుతం నిమిషానికి వేల సంఖ్యలో ఆర్డర్లు తీసుకునే స్థాయికి స్విగ్గీ ఎదిగింది.కొన్ని వేల మంది డెలివరీ బాయ్స్ కు సైతం ఈ సంస్థ ఉపాధి కల్పిస్తోంది.కొత్తగా బిజినెస్ రంగంలో కెరీర్ ను మొదలుపెట్టాలని భావించే ఎంతోమందికి స్విగ్గీ సక్సెస్ స్టోరీ( Swiggy Success Story ) ఇన్స్పిరేషన్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఇన్ స్టామార్ట్ స్విగ్గీ ద్వారా నిత్యావసర సరుకులు వేగవంతంగా సరఫరా చేయబడుతున్నాయి.

మొదటిసారి బయటకు వచ్చిన పవన్ చిన్న కూతురు.. వైరల్
Advertisement

తాజా వార్తలు