గ్రూప్-1 ఫలితాల నిలిపివేత

రాష్ట్రంలో తీవ్ర వివాదస్పదమైన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను హైకోర్టు నిలిపివేసింది.గ్రూప్ -1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో 8 వ్యాజ్యాలుదాఖలయ్యాయి.

 Suspension Of Group-1 Results, Group 1 , Results , Suspects , Examination Rules-TeluguStop.com

పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.డిజిటల్ వాల్యుయేషన్ గురించి చివరి దశలో తెలిపారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

తెలుగు మీడియం పేపర్ లను రాష్ట్రంలోనూ ఆంగ్ల మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ వాల్యుయేషన్ చేశారని దీంతో ఆంగ్ల మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని న్యాయవాది తెలిపారు.ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో వాల్యుయేషన్ ఎలా చేయిస్తుందని వాదించారు.

ఏపీపీఎస్సీ చైర్మన్ ను పక్కన పెట్టి కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించారని వివరించారు.ఇంటర్వ్యూలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

నిబంధనల ప్రకారమే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.వాల్యూషన్ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.రెండు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం గ్రూప్-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.గ్రూప్-1 ఇంటర్వ్యూతోపాటు తదుపరి చర్యలన్నిటినీ నిలువరిస్తూ ఈ ఏడాది జూన్ 16న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీపీఎస్సీ సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.మరోవైపు మౌఖిక పరీక్షకు ఎంపికైన కొందరు అభ్యర్థులు అప్పీళ్లు వేశారు.అందరూ వాదనలు విన్న ధర్మశాసనం గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు పక్కన పెట్టాలని ఆదేశించింది.మూడు నెలల్లో మాన్యువల్ మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించలని ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube