19 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

రాజ్యసభలో 19 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది.వారంపాటు సభకు రాకుండా ఆదేశాలు జారి చేశారు.

వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడం, సభా మర్యాదను ఉల్లంఘించేలా ప్రవర్తించినందుకుగానూ 19 మంది ఎంపీలను డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్ నారాయణ్ సింగ్ సభ నుంచి సస్పెండ్‌ చేశారు.సస్పెండైనవారిలో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు, డీఎంకేకు చెందిన ఆరుగురు, సీపీఎంకు చెందిన ఇద్దరు, సీపీఐకి చెందిన ఒకరు, టీఆర్ ఎస్ కు చెందిన ముగ్గురు ఎంపీలున్నారు.

ఈ వారం వరకు సభకు హాజరుకావొద్దని డిప్యూటీ ఛైర్మన్‌ ఆదేశించారు.పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా.

ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. దాంతో, ఉభయ సభల కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి.

Advertisement
Suspension Of 19 MPs In A Rajya Sabha Rajya Sabha, 19 MPs, Suspension , Trs ,

మంగళవారం కూడా రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు.ఆందోళనల నడుమ ఛైర్మన్‌ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు.

అయినప్పటికీ ఎంపీలు వెనక్కి తగ్గలేదు.ఛైర్మన్‌ వారిస్తున్నప్పటికీ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు.

దాంతో సభ పలుమార్లు వాయిదా పడింది.ఆ తర్వాత ఛైర్మన్‌ స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్‌ సభను నిర్వహిస్తుండగా, సభ్యుల తీరులో మార్పు రాలేదు.

దాంతో, 19మందిపై డిప్యూటీ ఛైర్మన్‌ సస్పెన్షన్ విధించారు.

Suspension Of 19 Mps In A Rajya Sabha Rajya Sabha, 19 Mps, Suspension , Trs ,
వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

అటు లోక్‌సభలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.సోమవారం లోక్‌సభలో నలుగురు కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడిన విషయం తెలిసిందే.కాంగ్రెస్‌ ఎంపీలు మాణికం ఠాగూర్‌, టి.ఎన్‌.ప్రతాపన్‌, జోతిమణి, రమ్యా హరిదాస్‌లను ఈ సీజన్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ ప్రకటించారు.పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.19 మంది ఎంపీలు ఈ వారం వరకు సభకు హాజరుకావొద్దని డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్ నారాయణ్ సింగ్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు