తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను ప్రశంసలను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్వయంకృషితో నేడు టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్లారు.
మెగాస్టార్ చిరంజీవి పనితనం ఆయనలో ఉన్న టాలెంట్ గుర్తించిన ప్రముఖ నటుడు అల్లూ రామలింగయ్య తన కుమార్తె సురేఖను మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చి వివాహం చేశారు.ఇకపోతే సురేఖ సైతం సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో ఆమె చిరంజీవికి అండగా నిలిచి ఆయన విజయానికి కారణమైందని మెగాస్టార్ చిరంజీవి ఎన్నోసార్లు ఈ విషయాన్ని తెలియజేశారు.
ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు ఎంతోమందికి ఆదర్శ దంపతులుగా నిలిచారు.ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం నిత్యం తన కుటుంబం కోసం తన పిల్లల కోసం అహర్నిశలు శ్రమిస్తూనే మరోవైపు సమాజ సేవ కోసం తన వంతు కృషి చేస్తున్నారు.
ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ జెంటిల్ మెన్ గా ఉండే మెగాస్టార్ చిరంజీవి పట్ల సురేఖ ఒక విషయంలో ఎంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఏమాత్రం నచ్చదని సురేఖ వెల్లడించారు.

మెగాస్టార్ చిరంజీవి విషయంలో సురేఖకు నచ్చని ఒక్క విషయం ఏమిటి అనే విషయానికి వస్తే.చిరంజీవి పని రాక్షసుడు అనే విషయం మనకు తెలిసిందే.ఆయన పని ధ్యాసలో పడి సరైన సమయానికి భోజనం చేయడని ఆ విషయంలో తనకు ఏమాత్రం నచ్చదని సురేఖ పలు సందర్భాలలో వెల్లడించారు.ఆయన షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు ఎలాగో సరైన సమయానికి భోజనం చేయరు కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా కూడా తను కరెక్ట్ సమయానికి భోజనం చేయరని సురేఖ వెల్లడించారు.
ఇలా సరైన సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అతని ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందోనని ఆమె ఆందోళన చెందుతారని ఈ విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలలో చిరంజీవి ఎంతో ఉన్నతంగా ఆలోచించడమే కాకుండా, అన్ని విషయాల పట్ల శ్రద్ధ తీసుకుంటారని సురేఖ వెల్లడించారు.