టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో దర్శకుడు వివి వినాయక్ ఒకరు.ఈయన మాస్ సినిమాలతో పాటు కామెడీ చిత్రాలను కూడా తెరకెక్కించి దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇలా వివి వినాయక్ దర్శకత్వంలో ఎంతోమంది ఇండస్ట్రీకి చెందిన హీరోల వారసులను లాంచ్ చేశారు.ఇలా లాంచ్ చేసిన వారిలో అఖిల్ అక్కినేని ఒకరు.
అఖిల్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ చిత్రం అఖిల్. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను సందడి చేయడంలో బోల్తా కొట్టింది.ఇలా అఖిల్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.ఈ సినిమాని ప్రేక్షకులు మాత్రమే కాకుండా అక్కినేని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు.ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వివి వినాయక్ ఈ సినిమాలో జరిగిన తప్పులు గురించి బయటపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.అఖిల్ సినిమా పరాజయం కావడానికి తానే కారణమని వినాయక్ ఒప్పుకున్నారు.

సాధారణంగా ఒక పెద్ద హీరో కొడుకుని ఇండస్ట్రీకి లాంచ్ చేసేటప్పుడు ఇలాంటి యాక్షన్స్ సన్నివేశాలతో ఉన్న చిత్రాలను కాకుండా, మొదటి సినిమా సింపుల్ గా లవ్ స్టోరీతో చేసి ఉంటే బాగుండేది.అయితే తాను పెద్ద హీరో కొడుకుతో సినిమా చేస్తున్నాను కనుక సినిమా అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకున్నాను కానీ కథ గురించి ఆలోచించలేదని ఈ సందర్భంగా వినాయక్ అఖిల్ సినిమా విషయంలో జరిగిన తప్పు గురించి ఒప్పుకొంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







