కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.

పాస్ ఓవర్ కావడంతో మధ్యాహ్నం 2 గంటలకు న్యాయస్థానం విచారించనుంది.

ఈనెల 25వ తేదీ వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ తీర్పును సునీతా రెడ్డి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

దీనిపై గత శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై స్టే విధించింది.స్టే ఇస్తే అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న న్యాయవాది వాదనలు విన్న కోర్టు స్టే ఇస్తూనే ఇవాళ్టి వరకు అవినాశ్ ను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది.

మరోవైపు దర్యాప్తునకు సమయం పొడిగించాలన్న సీబీఐ వినతిని సుప్రీం ధర్మాసనం పరిశీలించనుంది.

Advertisement
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

తాజా వార్తలు