Chandrababu : చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం( Skill Development Scheme ) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) బెయిల్ రద్దు పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

ఈ పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ( Justice Bela M Trivedi, Justice Pankaj Mittal )ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని, వెంటనే బెయిల్ ను రద్దు చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.వివరాలతో ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.

ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ కు సమాధానం ఇస్తామని చంద్రబాబు తరపు లాయర్ హరీశ్ సాల్వే తెలిపారు.ఈ క్రమంలోనే చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం తరపు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఈ క్రమంలో సీఐడీ పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం మరోసారి విచారణ జరపనుంది.

Advertisement
హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..

తాజా వార్తలు