ఉగాదికి కొత్త సినిమా మొదలుపెట్టనున్న సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు.

హిట్ మీద హిట్ కొడుతూ కేవలం తెలుగులోనే వందల కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్న హీరోగా మారిపోయాడు.

అతని సినిమా అంటే వంద కోట్ల కలెక్షన్ గ్యారెంటీ అని నిర్మాతలు కూడా ముందే ఫిక్స్ అయిపోతున్నారు.తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకొని ఇప్పుడు కొత్త సినిమా ప్లాన్ లో ఉన్నాడు.

ఇప్పటికే దర్శకుడు పరశురాంకి మహేష్ బాబు గ్రీన్ ఇచ్చాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా ఓపెనింగ్ ఉగాది రోజు చేయనున్నట్లు తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని తెలుస్తుంది.

అయితే అఫీషియల్ గా మాత్రం ఉగాది రోపు కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారని సమాచారం.ఇక ఇందులో హీరోయిన్లుగా ఎవరిని తీసుకుంటారు అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తుంది.

Advertisement

మరో వైపు మహేష్ బాబు చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.ఏది ఏమైనా ఫ్యామిలీ టైం పూర్తి చేసుకొని సూపర్ స్టార్ తన కొత్త సినిమాకి ఉగాదికి శ్రీకారం చుడుతున్నాడనేది మాత్రం వాస్తవం అని తెలుస్తుంది.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు