లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన సన్నీలియోన్‌

మాజీ పోర్న్‌స్టార్‌ సన్నీలియోన్‌ తాజాగా ముంబైలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో చేదు అనుభవాన్ని ఎదుర్కొవాల్సిన పరిస్థితి వచ్చింది.కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సన్నీలియోన్‌ అక్కడ లిప్ట్‌లో ఇరక్కు పోయిందట.

కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ అమ్మడు ఎక్కిన లిఫ్ట్‌ మధ్యలోనే ఆగిపోయిందట.దాంతో ఆమె మేనేజర్‌ తెగ కంగారు పడి పోయి, అక్కడి సిబ్బందిని హడావుడి పెట్టి వెంటనే లిఫ్ట నడిచేలా చర్చలు తీసుకున్నాడు.

సన్నీలియోన్‌ బయటకు వచ్చిన తర్వాత ఎంత ఇబ్బంది పెడుతుందో అని ఆ కార్యక్రమ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు.సన్నీలియోన్‌ లిఫ్ట్‌ నుండి బయటకు వచ్చిన తర్వాత చిరు నవ్వుతూ పర్వాలేదు అంటూ కార్యక్రమంలో పాల్గొందట.

దాంతో ఆమె మేనేజర్‌ మరియు ఆ కార్యక్రమ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారట.లిఫ్ట్‌లో ఇరుక్కు పోయినందుకు ఎక్కడ మూడ్‌ అవుట్‌ అయ్యి, వెళ్లి పోతుందో అని నిర్వాహకులు భయపడ్డారు.

అలా ఏం జరుగలేదని సంతోషం వ్యక్తం చేశారు.లిఫ్ట్‌ ఆగిపోయిన సమయంలో తన భర్త పక్కనే ఉండటం వల్ల సన్నీలియోన్‌ ఎక్కువ ఇబ్బంది పడలేదని, అందుకే ఆ కార్యక్రమం పాల్గొని పూర్తిగా ఉందని అంటున్నారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు