డీటీఎస్ తో హీరోగా మళ్ళీ పవర్ చూపించడానికి రెడీ అవుతున్న సునీల్

కమెడియన్ సునీల్ హీరోగా టర్న్ తీసుకున్న తర్వాత వరుస ఫ్లాప్ లు రావడంతో ఈ మధ్యకాలంలో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా బిజీ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇప్పటికే కలర్ ఫోటో సినిమాలో విలన్ గా మెప్పించి పుష్ప సినిమాలో కూడా పవర్ ఫుల్ పాత్రలో కనిపించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

మరో వైపు హీరోగా కూడా హరీష్ శంకర్ అందించిన కథతో వేదాంతం రాఘవయ్య అనే సినిమా చేస్తున్నాడు.కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగు, కన్నడ బై లింగ్వల్ మూవీని సునీల్ హీరోగా సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నాడు.

కమెడియన్ మళ్ళీ మునుపటి స్పీడ్ గా సునీల్ అందుకోవడం ఎలాగూ ప్రస్తుతం తరుణంలో కష్టం అని అర్ధమైంది.ఈ నేపధ్యంలో డిఫరెంట్ వేలో ప్రయత్నాలు చేస్తున్నాడు.

Advertisement

ఈ నేపధ్యంలోనే విలన్ గా తనని తాను ప్రాజెక్ట్ చేసుకోవడానికి కలర్ ఫోటోని సునీల్ శాంపిల్ గా చూపించాడు.ఇందులో అతని నటనకి మంచి ప్రశంసలు లభించాయి.

దీంతో నెగిటివ్ రోల్స్ లో అవకాశాలు పెరుగుతున్నాయి.ఈ నేపధ్యంలో హీరోగా వస్తున్న అవకాశాలు కూడా సునీల్ మిస్ చేసుకోవడం లేదు.

ఈ నేపధ్యంలో డీటీఎస్ (డేర్ టు స్లీప్) అనే చిత్రం రూపొందుతోంది.అభిరామ్ పిళ్లా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబందించిన పూజ కార్యక్రమాలు నిన్న జరిగాయి.

తెలుగు, కన్నడ భాషల్లో రూపొందే ఈ చిత్రంలో కన్నడ నటుడు చేతన్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాడు.డోనాల్, నటాషా హీరోయిన్లుగా నటిస్తారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు