ఐక్యరాజ్యసమితిలో కీలక పదవికి భారతీయ అధికారి రాజీనామా

ఐక్యరాజ్యసమితిలో సెక్రటరీ జనరల్ తరపున ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్‌ ది అసెట్స్ ఆఫ్‌ ది యూనైటెడ్ నేషన్స్ జాయింట్ స్టాఫ్ పెన్షన్ ఫండ్‌ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న భారతదేశానికి చెందిన సీనియర్ అధికారి సుధీర్ రాజ్‌కుమార్ తన పదవికి రాజీనామా చేశారు.

ఆయనను 2017 అక్టోబర్ లో యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ నియమించారు.

మార్చి 31న ఆయన రాజీనామా అమల్లోకి వస్తుందని గుటెర్రెస్ ప్రతనిధి స్టీఫెన్ డుజారిక్ ఒక ప్రకటనలో తెలియజేశారు.సెక్రటరీ జనరల్.

రాజ్‌కుమార్ రాజీనామాను ఆమోదించారని అలాగే ఐరాసలో జాయింట్ స్టాఫ్‌ పెన్షన్ ఫండ్‌కు సంబంధించిన ఆస్తులను నిర్వహించడంలో సమర్థవంతంగా పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఐక్యరాజ్యసమితిలో పనిచేసి పదవి విరమణ, మరణించడం, అంగవైకల్యం పొందిన వారికి ప్రయోజనాలను కలిగించేందుకు గాను జాయింట్ స్టాఫ్ ఫండ్‌ను 1948లో జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా స్ధాపించారు.రాజ్‌కుమార్ తన పదవి నుంచి వైదొలగిన నేపథ్యంలో కొత్త ప్రతినిధి నియామక ప్రక్రియను సెక్రటరీ జనరల్ త్వరలోనే ప్రారంభిస్తారు.ఐక్యరాజ్యసమితిలో నియామకానికి ముందు రాజ్‌కుమార్ వరల్డ్ బ్యాంక్ ట్రెజరీలో గ్లోబల్ పెన్షన్ అడ్వైజరీ కమిటీకి చీఫ్‌గా వ్యవహరించారు.ఈ హోదాలో ఆయన కొరియా రిపబ్లిక్ జాతీయ పెన్షన్ ఫండ్, దక్షిణాఫ్రికా, బ్రూనై దారుస్సలాం ఆర్ధిక మంత్రిత్వ శాఖకు సలహా సేవలను అందించారు.1988లో ప్రపంచబ్యాంక్‌లో జీవితాన్ని ప్రారంభించిన రాజ్‌కుమార్ ప్రిన్సిపల్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ సహా వివిధ హోదాల్లో పనిచేశారు.ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన రాజ్‌కుమార్, చికాగో వర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మాస్టర్ పట్టా అందుకున్నారు.

Advertisement
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

తాజా వార్తలు