సుధీర్ కు హ్యాండ్ ఇచ్చిన రష్మీ గౌతమ్.. ఐ హేట్ యూ అంటూ..?

బుల్లితెర జోడీ సుధీర్ రష్మీకి ప్రేక్షకుల్లో ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు.

తాజాగా ప్రసారమైన ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో రష్మీ బర్త్ డే సందర్భంగా సుధీర్ స్పెషల్ స్కిట్ చేశారు.

సుధీర్ రష్మీని ఇతర కమెడియన్లతో కలిసి పార్టీ అడగగా రష్మీ మీకోసం పుట్టినరోజు మళ్లీ జరుపుకుంటాను రండి అని పిలుస్తారు.ఆ తరువాత మీ అమ్మగారి నంబర్ ఇస్తే నోబెల్ ప్రైజ్ కు అప్లై చేస్తానని సుధీర్ చెబుతాడు.

రష్మీ అమాయకంగా నోబెల్ ఫ్రైజ్ ఏంటి.? అని అడగగా గొప్పగొప్పవి కనిపెడితే నోబెల్ ప్రైజ్ ఇస్తారట కదా అని చెబుతాడు.గొప్పది ఏం కనిపెట్టారని రష్మీ అడగగా నీ కన్నా గొప్పది ఏం కనిపెడతారని సుధీర్ బదులిస్తాడు.

ఆ తరువాత నీ అందం ఏమన్నా పెట్రోల్ రేటా.? రోజురోజుకు పెరిగిపోతుందని సుధీర్ చెప్పగా నీ మైండ్ నరేష్ హైటా ఎప్పటినుంచో అక్కడే స్ట్రక్ అయ్యి ఉందని రష్మీ పంచ్ వేస్తారు.ఆ తరువాత నీ పేరు బియ్యపుగింజపై రాయించానని సుధీర్ చెప్పగా అది కనపడటం లేదని రష్మీ చెబుతారు.

Sudheer Rashmi Birthday Skit In Jabardasth Goes Viral In Social Media, Birthday
Advertisement
Sudheer Rashmi Birthday Skit In Jabardasth Goes Viral In Social Media, Birthday

పక్కనే ఉన్న మరో కమెడియన్ ఆయన అన్నీ కనపడని పనులే చేస్తారని చెప్పుకొచ్చారు.ఆ తరువాత రష్మీ కేక్ కట్ చేసి సుధీర్ కు తినిపిస్తారు.ఆ తరువాత రష్మీ అందరికీ ఏం కావాలని అడిగి సుధీర్ ను మాత్రం అడగదు.

అందరినీ అడిగి తనను అడగలేదని సుధీర్ చెప్పగా నిన్ను అడిగితే నువ్వేం అడుగుతావో తనకు తెలుసని కమెడియన్ చెప్పుకొచ్చారు.

Sudheer Rashmi Birthday Skit In Jabardasth Goes Viral In Social Media, Birthday

ఆ తరువాత రష్మీ ఫోటో గోడపై ఉండగా సుధీర్ ఖుషీ నడుము సీన్ స్పూఫ్ చేస్తాడు.ఆ తర్వాత వంద సంవత్సరాలు వెంట పడినా నేను యాక్సెప్ట్ చేయనని ఐ హేట్ యూ అని చెబుతారు.సుధీర్ కు ఈ ఎపిసోడ్ లో రష్మీ హ్యాండ్ ఇవ్వడం గమనార్హం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు