కుల వృత్తుల ఆర్థిక (సబ్సిడీ)లో ప్రజాప్రతినిధుల జోక్యం తగదు : సుద్దాల నరేష్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana State Government ) ప్రవేశపెట్టిన జివో నెంబర్ 5 ప్రకారం కుల వృత్తులకు (సబ్సిడీ)ఆర్థిక పథకాన్నికి ఎంపికైన లబ్ధిదారులకు లక్ష రూపాయలు ఆర్థిక సహకారం వెంటనే ఇవ్వాలని తెలంగాణ రజక విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి సుద్దాల నరేష్ అన్నారు.సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ కుల వృత్తుల ఆర్థిక సబ్సిడీలో ప్రజా ప్రతినిధుల రాజకీయలా జోక్యం ఆపాలని, అర్హత కలిగిన వృత్తిదారులందరికీ పారదర్శకంగా ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టినటువంటి జివో నెంబర్ 5 ప్రకారం 1.10000లక్షల మంది రజక వృత్తిదారులు ఆర్థిక పథక సహకారం కొరకు ఆన్లైన్లో ద్వారా దరఖాస్తు చేశారు.కొన్నిచోట్ల వెరిఫికేషన్ పూర్తయిన లబ్ధిదారులకు చెక్కులు అందలేదన్నారు.

మరికొన్ని చోట్ల అధికార పార్టీ కార్యకర్తలకు చెక్కులు అందిస్తున్నారు.అర్హత కలిగిన వృత్తిదారులకు ఇవ్వకుండా అనర్హతలను ఎంపిక చేసే విధానం మానుకోవాలని దరఖాస్తు చేసిన లబ్ధిదారులందరికీ వెంటనే చెక్కులు మంజూరు చేయాలని,వీటికి కావలసిన నిధులు కూడా వెంటనే ఆయా జిల్లాలకు విడుదల చేయాలని అన్నారు.

అదేవిధంగా ఎంపిక చేసే విధానాన్ని ప్రజా ప్రతినిధులకు ఇవ్వకూడదన్నారు.ఎంపిక విధానాన్ని అధికారులు ఎంపిక చేసి పూర్తయిన లబ్ధిదారులకు అందరికీ ప్రతి నెల 15 తేదీలో చెక్కులు పంపిణీ చేయాలన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News