తెలంగాణలో ఓ కుర్రాడి ప్రాణం తీసిన పబ్ జీ సరదా! వద్దన్నందుకు ఆత్మహత్య

స్మార్ట్ ఫోటో చేతిలోకి వచ్చిన తర్వాత అందులో సోషల్ మీడియా యాప్స్, ఆపైన గేమ్స్ పిల్లల నుంచి యువతరం వరకు అందరిని తన వైపు లాగేసుకుంటున్నాయి.

ఓ విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా యాప్స్ అనేవి యువతరాన్ని తనకి బానిసలుగా చేసుకుంటున్నాయి.

స్మార్ట్ లో గేమ్స్ ద్యాసలో పడి చదువుని, ఉద్యోగ జీవితాన్ని, అలాగే వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలా మంది కోల్పోతున్నారు.కొంత మంది ఒత్తిడికి లోనవుతూ తమని తాము చంపుకుంటూ ఉంటే కొంత మంది ఈ గేమ్స్ వ్యామోహంలో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.

నియంత్రణ లేని సోషల్ మీడియా స్వేచ్చ కారణంగా ఫోన్స్ లోకి ప్రమాదకరమైన కిల్లర్ గేమ్స్ ని కొంత మంది తయారు చేసి వదులుతున్నారు.ఈ కిల్లర్ గేమ్స్ ఎంత వేగంగా యువతని తమ వైపుకి తిప్పుకుంటున్నాయో అంతే వేగంగా వారి భావోద్వేగాలతో ఆడుకుంటూ ప్రాణాలు తీస్తున్నాయి.

గతంలో పోకోమెన్, బ్లూ వైల్ లాంటి గేమ్స్ తరహాలో ఇప్పుడు పబ్ జీ టీనేజ్ యువత నుంచి కాలేజీ యువత వరకు అందరిని తన వైపు తిప్పుకుంది.ఈ గేమ్స్ వ్యామోహంలో పడి ఇప్పటికి రోడ్డు ప్రమాదాలలో కొంత మంది చనిపోగా, మరికొంత మంది బలవన్మరణంకి పాల్పడ్డారు.

Advertisement

పబ్జీ గేమ్ ఆడొద్దని తల్లి మందలించడంతో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో చోటుచేసుకుంది.విష్ణుపురి కాలనీకి చెందిన పురోహితుడు కె.భరత్‌రాజా, ఉమాదేవి దంపతులకు కుమారుడు సాంబశివ తరుచూ సాంభశివ పబ్జీ గేమ్ ఆడుతున్నట్లు కుటుంబ స‌భ్యులు గుర్తించారు.గేమ్ ఆడితే చదువులో వెనుకబడిపోతావని, ఆట మానేస్తే మంచి మార్కులు సాధిస్తావని తల్లి పలుసార్లు చెప్పింది.

బుధవారం 10వ తరగతి పరీక్ష రాసేది ఉందని పబ్జీ గేమ్ ఆడొద్దని మంగళవారం తల్లి కొడుకు సాంబశివను మందలించింది.దీంతో కలత చెంది ఆవేశంతో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి మెడకు టవల్‌తో బిగించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇలాంటి ఘటనల నేపధ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు పబ్ జీ ని నిషేధించాయి.ఇప్పుడు అది తెలుగు రాష్ట్రాలకి కూడా పాకింది.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు