ఈ మధ్య కాలంలో కొందరు వివాహేతర సంబంధాలు మోజులో పడి వావి వరుసలు మరియు వయస్సు భేదాలు వంటివి ఏ మాత్రం పట్టించుకోకుండా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు.కాగా తాజాగా ఓ విద్యార్థి పాఠాలు చెప్పే పంతులమ్మపై మోజు పడి ఆమెతో శారీరక సంబంధం కావాలని వేధింపులకు గురి చేస్తూ ఉండడంతో చివరికి ఆ పంతులమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని తిరువనంతపురం పరిసర ప్రాంతంలో “రంజిత్” అనే ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.అయితే ఇతడు స్థానికంగా ఉన్నటువంటి ఓ కళాశాలలో చదువుతున్నాడు.
ఈ క్రమంలో కళాశాలలో జరిగేటటువంటి వేడుకలకు ఇదే ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయురాలు హాజరయ్యింది.దీంతో సరదాగా ఉపాధ్యాయురాలు రంజిత్ ని చూసి నవ్వడంతో పాటు కొంత సేపు ముచ్చటించింది.
దీంతో రంజిత్ ఏకంగా ఉపాధ్యాయురాలిపై మనసు పారేసుకున్నాడు.అనంతరం ఎమోషనల్ డైలాగులు చెబుతూ ఏకంగా ఉపాధ్యాయురాలిని ప్రేమలోకి దింపాడు.
దీంతో కొంతకాలం పాటు రంజిత్ మరియు ఉపాధ్యాయురాలు కలిసి సహజీవనం కూడా చేశారు.
కానీ రంజిత్ కి గతంలో పలు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉండటంతో పాటు కాలేజీలో చదివే యువతులతో కూడా లవ్ ఎఫైర్లు ఉన్నట్లు ఉపాధ్యాయురాలు తెలుసుకుంది.
దీంతో కొద్దిరోజుల పాటు రంజిత్ ని తనకి దూరంగా ఉండాలంటూ ఇంటి నుంచి గెంటేసింది.అయినప్పటికీ రంజిత్ కి ఉపాధ్యాయురాలిపై మోజు తీరకపోవడంతో ఆమెను లైంగికంగా వేధించేవాడు.
దీంతో తాజాగా రంజిత్ ఆగడాలు రోజురోజుకీ ఎక్కువ అవుతుండడంతో దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రంజిత్ ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా శృంగారం కోసం గత కొద్దికాలంగా ఉపాధ్యాయుని వేధిస్తున్న మాట వాస్తవమేనని నేరాన్ని అంగీకరించాడు.