వైరల్ వీడియో: రన్ ఔట్స్ లో ఈ రన్ ఔట్ వేరయా..!

టీమిండియా మహిళలు అత్యద్బుతమైన ఆటతీరును కనబరుస్తున్నారు.ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో మూడు టీ20ల సిరీస్ లో టీమిండియా మహిళా జట్టు తలపడుతోంది.

ఆదివారం రాత్రి రెండో టీ20 మ్యాచ్ జరిగింది.ఆ మ్యాచ్ లో టీమిండియా 8 పరుగుల తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

మూడు టీ20ల సిరీస్ ను 1-1తో టీమిండియా మహిళా జట్టు సమానంగా చేసింది.మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు పోగొట్టుకుంది.148 పరుగులు చేసి ప్రత్యర్థులకు టార్గెట్ ను ఇచ్చింది.ఓపెనర్ షెఫాలీ వర్మ దూకుడుగా ఆడారు.

మ్యాచ్ లో ఆమె 48 పరుగులు సాధించడం విశేషం.అందులో 8ఫోర్లు, సిక్స్ కొట్టి సత్తా చాటారు.

Advertisement

నాలుగో ఓవర్ లో ఓపెనర్ షెఫాలీ వరుసగా ఐదు ఫోర్లు కొట్టి సూపర్ ఫాంను అందుకున్న తర్వాత మరో ఓపెనర్ హర్మన్ ప్రీత్ 31 పరుగులు చేసింది.ఇక దీప్తీ శర్మ 24 నాటౌట్ తో క్రీజ్ లో నిలిచింది.ఆ తర్వాత 150 పరుగలు లక్ష్యంతో ఇంగ్లండ్ టీమ్ బ్యాటింగ్ కు దిగింది.20 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 8వికెట్లు కోల్పోయి కేవలం 140 పరుగులే చేసింది.ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ లో బీమాంట్ 59 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచి టీమ్ ను కొంత వరకూ నిలిపింది.

ఇంగ్లండ్ విజయానికి 20 ఓవర్లో 14 పరుగులు అవసరమే కానీ ఆ జట్టు కేవలం 5 పరుగులు మాత్రమే చేసింది.మ్యాచ్ లో కీలకమైన బీమాంట్ వికెట్ ను దీప్తీ శర్మ తీసింది.

దీంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అవార్డు అందజేశారు.

ఇంగ్లండ్ కెప్టెన్ హెదర్ నైట్ ఈ మ్యాచ్ లో రనౌట్ అవ్వడం ఇప్పుడు వైరల్ అవుతోంది.ఈ రనౌట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.14 ఓవర్ లో దీప్తి శర్మ బౌలింగ్ చేస్తుండగా క్రీజులో జోన్స్, హెదర్ నైట్ ఉన్నారు.చివరి బంతిని జోన్స్ స్ట్రెయిట్ షాట్ ఆడినప్పుడు రన్ కోసం హెదర్ ప్రయత్నించి కొంచెం ముందుకు వెళ్లినప్పుడు ఆ బాల్ బౌలర్ దీప్తీ కాళ్లను టచ్ చేసి వెళ్లి స్టంప్స్ ను తగిలింది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

దీప్తీ, షెఫాలీ ఔట్ అయ్యిందంటూ సంబరాలు చేసుకున్నారు.దీనిని అంపైర్ రనౌట్ గా తేల్చడంతో ఇంగ్లండ్ టీమ్ షాక్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు