Top Cricketers : క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లను గెలిపించిన స్టార్ ఆటగాళ్లు వీళ్లే..!

క్రికెట్ ఆటలో గెలుపు, ఓటములు సహజం.అయితే జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వారికి ప్రత్యేక గౌరవం దక్కుతుంది.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లలో విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

రికీ పాటింగ్:

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ రికీ పాంటింగ్,( Ricky Ponting ) జట్టు కెప్టెన్ గా ఆస్ట్రేలియాను ఏకంగా రెండుసార్లు ప్రపంచ కప్ విజేతగా నిలబెట్టాడు.ఆస్ట్రేలియా జట్టు ఏకంగా 377 అంతర్జాతీయ మ్యాచులలో విజేతగా నిలబడడంలో కీలకపాత్ర పోషించాడు.

మహేళ జయవర్ధనే:

శ్రీలంక జట్టు కెప్టెన్ మహేళ జయవర్ధనే( Mahela Jayawardene ) శ్రీలంక జట్టును కీలకమైన టోర్నీలలో విజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు.శ్రీలంక జట్టును ఏకంగా 336 అంతర్జాతీయ మ్యాచులలో విజేతగా నిలబడడంలో కీలకపాత్ర పోషించాడు.

విరాట్ కోహ్లీ:

Advertisement

భారత జట్టు స్టార్ బ్యాట్స్ మెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) భారత జట్టుకు అద్భుతమైన మర్చిపోలేని విజయాలు అందించాడు.ముఖ్యంగా భారత జట్టు పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లపై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.భారత జట్టును ఏకంగా 313 అంతర్జాతీయ మ్యాచులలో విజేతగా నిలబెట్టాడు.

సచిన్ టెండుల్కర్:

భారత జట్టు మాజీ దిగ్గజం, క్రికెట్ గాడ్ ఫాదర్ సచిన్ టెండుల్కర్( Sachin Tendulkar ) వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.ఇప్పటివరకు ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదు.సచిన్ టెండుల్కర్ 37 అంతర్జాతీయ మ్యాచ్లలో భారత జట్టును విజేతగా నిలబెట్టాడు.

జాక్వెస్ కల్లీస్:

సౌత్ ఆఫ్రికా జట్టు ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లీస్( Jacques Kallis ) 305 అంతర్జాతీయ మ్యాచ్లలో సౌత్ ఆఫ్రికా జట్టును విజేతగా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాడు.

కుమార సంగక్కర:

శ్రీలంక జట్టు వికెట్ కీపర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ కుమార సంగక్కర( Kumara Sangakkara ) శ్రీలంక జట్టుకు ఎన్నో తిరుగులేని విజయాలను అందించాడు.శ్రీలంక జట్టు 305 అంతర్జాతీయ మ్యాచులలో విజేతగా నిలబడడంలో కీలకపాత్ర పోషించాడు.

రోహిత్ శర్మ:

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు.హిట్ మ్యాన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.భారత జట్టు 229 అంతర్జాతీయ మ్యాచులలో విజేతగా నిలబడడంలో కీలకపాత్ర పోషించాడు.

మహేంద్రసింగ్ ధోని:

Advertisement

భారత జట్టుకు వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ అందించాడు.భారత జట్టుకు ఎన్నో కీలకమైన విజయాలు అందించాడు.298 అంతర్జాతీయ మ్యాచులలో భారత జట్టు విజేతగా నిలబడడంలో కీలక పాత్ర పోషించాడు.

తాజా వార్తలు