లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్( BRS ) కు మరో షాక్ తగిలింది.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప( Koneru Konappa ) గులాబీ పార్టీకి రాజీనామా చేశారు.
ఈ క్రమంలోనే ఆయన రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )తో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలతో కోనేరు కోనప్ప భేటీ అయిన సంగతి తెలిసిందే.
కాగా అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో పాటు తాజాగా బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడాన్ని కోనేరు కోనప్ప తీవ్రంగా వ్యతిరేకించారు.ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరనున్నారని సమాచారం.