స్టార్ హీరో కూతురు అయితే ఆ హోదా రాదు... శృతిహాసన్ పోస్టు వైరల్!

లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు నటి శృతిహాసన్.ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరియర్ మొదట్లో పలు వడిదుడుకులను ఎదుర్కొన్నారు.

ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.ఇలా శృతిహాసన్ నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ కావడంతో కెరియర్ మొదట్లో ఈమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు.

ఇలా ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నటువంటి ఈమె గబ్బర్ సింగ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.ఈ సినిమా తర్వాత ఈమె నటించిన రేసుగుర్రం, ఎవడు, శ్రీమంతుడు వంటి వరుస సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయారు.

ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తున్న శృతిహాసన్ తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి దూరమైనటువంటి శృతిహాసన్ రవితేజ హీరోగా గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో సక్సెస్ అందుకున్నటువంటి శృతిహాసన్ చిరంజీవి బాలకృష్ణ సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నారు.ఇక ఈ రెండు సినిమాల్లో కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఇక ప్రస్తుతం శృతిహాసన్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తున్నారు.

శృతిహాసన్ కు ప్రభాస్ తో ఇది మొదటి సినిమా అలాగే ఈ సినిమా ద్వారా ఈమె పాన్ ఇండియా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇకపోతే నేడు శృతిహాసన్ పుట్టినరోజు కావడంతో పలువురు సెలబ్రిటీలు ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక ప్రభాస్ సైతం ఈమెకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక తన పుట్టినరోజు సందర్భంగా శృతిహాసన్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా శృతిహాసన్ నెపోటిజం గురించి షాకింగ్ పోస్ట్ చేశారు.తన తండ్రి గొప్ప నటుడు కావడంతో ఈమె కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తుందంటూ గతంలో వార్తలు వచ్చాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అయితే ఈ వార్తల పై ఈమె స్పందిస్తూ తండ్రి గొప్ప నటుడు అయితే అలాంటి స్టార్ హోదా మనకు అంత సులభంగా రాదు ఆ హోదా అనుభవించడం కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుందని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు