స్టార్ క్రికెట్ ప్లేయర్ రిషబ్ పంత్ వన్డే వరల్డ్ కప్ కి దూరం..!!

టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికావడం తెలిసింది.

ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్ వెళ్తున్న సమయంలో అత్యంత వేగంగా కారుతో డివైడర్ ని ఢీకొనడంతో.

పంత్ తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ప్రమాదంలో కారు మొత్తం అగ్నికి ఆహుతి అయింది.

ఈ క్రమంలో కారు నుండి చాకచక్యంగా పంత్ బయటపడ్డాడు.అనంతరం డెహ్రాడూన్ మ్యాక్స్ హాస్పిటల్ లో స్థానికులు జాయిన్ చేయగా తర్వాత ముంబైలోని కోకిలబెన్ హాస్పిటల్ లో ప్రస్తుతం మెరుగైన చికిత్స తీసుకుంటూ ఉన్నారు.

అయితే ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ మోకాలికి బలమైన గాయం కావడంతో కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు కోలుకునే సమయం పడుతుంది అని వైద్యులు బీసీసీఐకి తెలిపినట్లు సమాచారం.ఈ పరిణామంతో ఐపీఎల్ తో పాటు ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ కి పంత్ దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

 పంత్ కనీసం కోల్పోవడానికి ఎనిమిది నుండి తొమ్మిది నెలలు ఖచ్చితంగా పడుతుందని వైద్యులు తెలియజేశారు.ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే ప్రపంచ కప్ స్టార్ట్ కానుంది.

దీంతో బీసీసీఐ వైద్యుల రిపోర్టర్ల ప్రకారం పంత్ నీ ప్రపంచ కప్ నుండి పక్కకు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు