సిబిఐ కి డోర్ క్లోజ్ చేసిన స్టాలిన్!

కేంద్ర అధికార పార్టీ బిజెపి( BJP ) తమ రాజకీయ అవసరాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడి ,సిబిఐ లను పావుగా వాడుకుంటుందని, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికి ఈ సంస్థల ద్వారా అనేక కేసులు పెట్టి వేధిస్తుందని ఆరోపణలు చాలా కాలంగా ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి.

ఆదిశగానే దాదాపు తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐ( CBI ) కి నో ఎంట్రీ బోర్డు పెట్టాయి.

అంటే ఈ రాష్ట్రాలలో సిబిఐ కానీ ఈడీ కానీ ఏదైనా కేసు టేక్ అప్ చేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు అనుమతి తప్పనిసరి.ఒకవేళ ఆ ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోతే ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి అనుమతి సంపాదించిన తర్వాత మాత్రమే ఆ కేసును ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు మరో రాష్ట్ర ప్రభుత్వం సి బిఐ కు నో ఎంట్రీ బోర్డు పెట్టింది .తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ( Chief Minister Stalin )ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు.ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని( Senthil Balajini ) ఈడి అరెస్టు చేసింది.

ఆయన పై వచ్చిన మనీ లాండరింగ్ కేసులలో బాగం గా ఆయన అరెస్టు జరిగినట్లుగా సమాచారం .అయితే ఇది సమాఖ్య విధానంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడి గా అభివర్ణించిన సీఎం స్టాలిన్( CM Stalin ) గంటల వ్యవది లోనే సిబిఐ కి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు .ఈ మేరకు తమిళనాడు ప్రబుత్వం జీవో జారీ చేసింది దీంతో సిబిఐ కి నో చెప్పిన రాష్ట్రాల సంఖ్య పదికి చేరింది .

Advertisement

అరెస్ట్ చేసిన సెంథిల్ బాలాజీ తీవ్ర చాతి నొప్పితో బాధపడటంతో ఆయనను ప్రభుత్వ ఆధ్వర్యంలోని మల్టీస్పెషల్టి హాస్పిటల్ కి తరలించగా ఆయనకు బైపాస్ సర్జరీ అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం.తమకి కావలసిన వ్యక్తుల విషయంలో ఒకలా ప్రతిపక్ష నాయకులు ముద్దాయిల్లా ఉన్న కేసు లలో మరోలా ముందుకు వెళుతున్న సిబిఐ వైఖరి తరచూ ప్రశ్నార్థకంగా మారుతుంది.కేవలం రాజకీయ అవసరాల కోసమే ఈ సంస్థలు పనిచేస్తున్నట్టుగా ఉన్నాయని ఆరోపణలు ఇంతకు ముందు కూడా చాలా సార్లు వచ్చాయి.

తుది దశకువచ్చిన కేసులు కూడా తేలనటువంటి విచిత్ర పరిస్థితి సిబిఐ లో ఉండటం దానిలో రాజకీయ ప్రమేయం ఉందన్న ప్రశ్నలకు ఆస్కారం ఇస్తుంది .

Advertisement

తాజా వార్తలు