తండ్రి వ్యవసాయ కూలీ.. కూతురు పదో తరగతిలో టాపర్.. ఈ చిన్నారి సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కెరీర్ పరంగా ఏ రంగంలోనైనా సక్సెస్ సాధించాలంటే రేయింబవళ్లు ఎంతో కష్టపడాలి.

ఎనిమిదో తరగతిలోనే కుటుంబ సభ్యుల కష్టాన్ని గుర్తించి, గమనించి హేమశ్రీ అనే విద్యార్థిని రేయింబవళ్లు ఎంతో కష్టపడి చదువుకున్నారు.

ఇంజనీర్ కావాలని భావిస్తున్న హేమశ్రీ( Hemashree ) పదో తరగతిలో టాపర్ గా నిలవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.హేమాశ్రీ పదో తరగతిలో ఏకంగా 594 మార్కులు సాధించారు.

హేమాశ్రీ మాట్లాడుతూ మా నాన్న వ్యవసాయ కూలీగా ఉంటూ ఫ్యామిలీని పోషించేవారని అయితే కూలీగా ఎంత కష్టపడి పని చేసినా వచ్చిన డబ్బు సరిపోయేది కాదని హేమాశ్రీ అన్నారు.సంపాదించిన డబ్బు సరిపోకపోవడంతో నాన్న విశాఖ వచ్చి పూర్ణా మార్కెట్( poorna market ) లో కలాసీగా పని చేస్తున్నారని ఆమె కామెంట్లు చేశారు.

నాకు మంచి మార్కులు వస్తుండటంతో నాన్న ఎప్పుడూ నా చదువు గురించే ఆలోచించేవారని హేమాశ్రీ అన్నారు.

Advertisement

చాలీచాలని సంపాదన ఉన్నా చదువు విషయంలో ఇబ్బందులు రాకుండా చదివించారని ఆమె తెలిపారు.ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి స్కీమ్ నా జీవితాన్ని మార్చిందని హేమాశ్రీ తెలిపారు.హేమశ్రీ పూర్తి పేరు కామిరెడ్డి( Kamireddy ) హేమశ్రీ కాగా నాన్నే నా సక్సెస్ కు స్పూర్తి అని అన్నారు.

తల్లీదండ్రులకు ఏరోజూ నా చదువు భారం కాకూడదని భావించానని హేమాశ్రీ కామెంట్లు చేశారు.

నాన్న కళ్లలో ఆనందాన్ని చూడాలనే ఆలోచనతో కష్టపడి చదువుతున్నానని హేమాశ్రీ వెల్లడించారు.నేను రెసిడెన్షియల్ స్కూల్ లో చదివానని ఈ మధ్య కాలంలో పరిస్థితులు మెరుగయ్యాయని హేమాశ్రీ అన్నారు.హేమాశ్రీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

హేమాశ్రీ భవిష్యత్తులో ఇంజనీర్ కావాలని కన్న కలను సులువుగానే నెరవేర్చుకోవాలని ఆశిద్దాం.ఎంతోమంది నేటితరం విద్యార్థుల్లో ఆమె సక్సెస్ స్టోరీ స్పూర్తి నింపుతుందని చెప్పవచ్చు.

వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..
Advertisement

తాజా వార్తలు