హీరోయిన్స్ అనగానే కేవలం మేకప్, చాలీచాలని బట్టలు, అందాలతో కనువిందు చేయడం మాత్రమే అనుకుంటారు.
కానీ కొంతమంది హీరోయిన్స్ కి మాత్రం మంచి మనసు ఉంటుంది.
వారు తమ మనసు చెప్పిన విధంగానే నడుచుకుంటారు.ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా నచ్చింది మాత్రమే చేస్తారు.
అలాంటి హీరోయిన్స్ లో సౌందర్య, సాయి పల్లవి వంటి వారు ముందు వరుసలో ఉంటారు.ఎవరేం చెప్పినా ఎక్స్పోజింగ్ కి మాత్రం ఖచ్చితంగా నో అంటారు.
ఒకవేళ ఎక్స్పోజింగ్ చేయడం అనేది వారి పూర్తి స్వంత నిర్ణయమైనా మంచి మనసు ఉండాలి అన్న రూల్ అయితే ఏమీ లేదు.అలా అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు పెట్టుకొని హీరోయిన్స్ కూడా మంచి మనసును కలిగి ఉంటారు.
వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇటీవల టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల.రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది ఈ అమ్మడు.మొదట కన్నడలో ఒకటి, రెండు సినిమాలు చేసిన పర్వాలేదు అనిపించుకుంది.
ఇక పెళ్లి సందడి తర్వాత మరో రెండు కన్నడ సినిమాలు చేసింది.ప్రస్తుతం రవితేజ ధమాకా సినిమాలో నటించి క్రేజీ ప్రాజెక్టులో మంచి పాత్ర దక్కించుకుంది.
కేవలం నటన మాత్రమే కాదు ఈ అమ్మడు ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది.చదువులంటే కూడా ప్రాణమే.డాక్టర్ అవ్వాలని కలలు కంటోంది.
తల్లిని ఆదర్శంగా తీసుకొని బెంగళూరులో చదువును పూర్తి చేస్తుంది.
ఇక అసలు విషయమేంటంటే ఇంత చిన్న వయసులో ఆమెకి ఎంతో ఉదారమైన స్వభావం ఉంది.కేవలం 21 ఏళ్ళ వయసులోనే ఇద్దరు చిన్నపిల్లలని దత్తత తీసుకొని పెంచుతుంది.అయితే వాళ్ళు మామూలు పిల్లలు కాదు.
అంగవైకల్యంతో కూడిన పిల్లలు.అలాంటి వారిని దత్తత తీసుకోవాలంటే నిజంగా పెద్ద మనసు ఉండాలి.
సినిమా సినిమాకి రెమ్యునరేషన్ పెంచుతుంది అని అంటారు కానీ పెంచిన డబ్బులను ఎలా వాడుతుందో ఎవ్వరూ మాట్లాడరు.శ్రీ లీల మాత్రం తన సంపాదిస్తున్న దాంట్లో చాలా మట్టుకు సమాజసేవ చేయాలనే కోరుకుంటుంది.
చిన్నతనం నుంచి తండ్రి లేకుండా పెరిగింది కాబట్టి కుటుంబ విలువలు ఏంటో తనకు బాగా తెలుసు.అందుకే ఇంత చిన్న వయసులోనే ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకుంటుంది .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy