ఆ ఇద్దరికి ఏఎన్నార్‌ ఆవార్డులు  

Sridevi And Rekha Take The Anr Awards In This Year-anr Awards,t. Subbi Ram Reddy,telugu Cinima Legend

అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా లెజెండ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆయన పేరు మీద జాతీయ అవార్డులను ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.చాలా ఏళ్లుగా ఈ ఆనవాయితి వస్తుంది.ఏఎన్నార్‌ ఉన్నప్పటి నుండి కూడా జాతీయ అవార్డులను ఇస్తూ వచ్చారు.

Sridevi And Rekha Take The Anr Awards In This Year-anr Awards,t. Subbi Ram Reddy,telugu Cinima Legend Telugu Tollywood Movie Cinema Film Latest News-Sridevi And Rekha Take The ANR Awards In This Year-Anr T. Subbi Ram Reddy Telugu Cinima Legend

ఆయన పోయాక కంటిన్యూ అవుతుంది.గత ఏడాది ఏఎన్నార్‌ అవార్డులను ప్రధానం చేయలేదు.అందుకే ఈ సారి గత ఏడాది మరియు ఈ ఏడాదికి కలిపి అవార్డులను ఇచ్చేందుకు నాగార్జున ముందుకు వచ్చాడు.

ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ఏఎన్నార్‌ అవార్డులకు ఎంపిక చేసేందుకు జ్యూరీ చైర్మన్‌గా టీఎస్సార్‌ను అక్కినేని కుటుంబం నియమించింది.

ఆయన 2018 సంవత్సరంకు గాను శ్రీదేవికి మరియు 2019 సంవత్సరానికి గాను రేఖకు ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు.వీరిద్దరు ఇండియన్‌ సినిమాకు చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావని అందుకే ఈ అవార్డుకు వారు పూర్తిగా అర్హులు అని తాము భావించినట్లుగా ఆయన పేర్కొన్నాడు.ఈనెల 17వ తారీకున ఈ అవార్డు ప్రదానోత్సవం జరుగబోతుంది.