ఆ మెగా హీరో కెరీర్ పతనం అయ్యే స్టేజ్ లో ఉందంటున్న శ్రీ రెడ్డి...

తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై పోరాటం చేసి అనుకోకుండా టాలీవుడ్ సినిమా పరిశ్రమ బహిష్కరణకు గురైన తెలుగు నటి శ్రీరెడ్డి గురించి సినిమా పరిశ్రమలో తెలియనివారుండరు.

అయితే ఈ అమ్మడు తెలుగు సినిమా పరిశ్రమను వదిలిపెట్టి వెళ్లిపోయినప్పటి నుంచి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో నివాసం ఉంటోంది.

అంతేకాక అప్పుడప్పుడు తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకుంటూ తరచూ ఏదో ఒక విషయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.అయితే తాజాగా తన అనుమతి లేకుండా కొంతమంది తనకు సంబంధించిన ఫేస్ బుక్ వీడియోలను కొంతమంది యూట్యూబ్ లోని తమ చానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారని వాపోయింది.

అంతేకాకుండా ఇకపై తన వీడియోలుగానీ లేదా కథనాలనుగానీ  తన అనుమతి లేకుండా తమయూట్యూబ్ ఛానళ్లలో అప్లోడ్ చేస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటానని కూడా వార్నింగ్ ఇచ్చింది.కాగా ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు హెల్త్ మరియు ఇతర అంశాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఫేస్ బుక్ లో రోజురోజుకి తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటుంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తాజాగా మరోమారు శ్రీ రెడ్డి మెగా ఫ్యామిలీ హీరోలపై ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇందులో భాగంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓ హీరో కెరీర్ పతనం అయ్యే స్టేజ్ లో ఉందని తన సిక్స్త్ సెన్స్ చెబుతోందని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Advertisement

అంతేకాకుండా తన సిక్స్త్ సెన్స్ ఎప్పుడూ తప్పు కాలేదని, అలాగే తనకి ఎవరిమీద కోపం లేదని కూడా వ్యంగంగా కామెంట్లు చేసింది.అంతేకాకుండా శ్రీరెడ్డి భవిష్యవాణి అనే హాష్ టాగ్ ని కూడా ఈ పోస్ట్ కి జత చేసింది.

కానీ ఆ హీరో ఎవరన్నది మాత్రం శ్రీ రెడ్డి చెప్పలేదు.దీంతో శ్రీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలని కొంతమంది మెగా అభిమానులు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా గతంలో ఇలాంటి భవిష్యవాణిలను చాలానే విన్నామంటూ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఫోటోలను జోడించి ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు