శ్రీలీలకి మహేష్ బాబు సినిమా ప్లస్ అవ్వనుందా? మైనస్ అవ్వనుందా?

పెళ్లి సందడి సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రీలీల.

ఈ అమ్మడు మొదటి సినిమా తో కమర్షియల్ గా నిరాశ పర్చినా కూడా మొత్తానికి అవకాశాల విషయంలో స్టార్‌ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గడం లేదు.

వరుసగా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు మరియు దక్కుతున్న సక్సెస్‌ లు ఈ అమ్మడి యొక్క క్రేజ్ మరియు స్థాయిని పెంచాయి అనడంలో సందేహం లేదు.హీరోయిన్‌ గా ఈ అమ్మడు మొదటి కమర్షియల్‌ సక్సెస్ ను రవితేజ తో కలిసి నటించిన ధమాకా సినిమా తో దక్కించుకున్న విషయం తెల్సిందే.

హీరోయిన్ గా ఈ అమ్మడి యొక్క ఆఫర్లు భారీగా పెరుగుతున్నాయి.తెలుగు తో పాటు కన్నడం మరియు తమిళంలో కూడా ఆఫర్లు వస్తున్నాయి.

ఈ సమయంలో ఈ అమ్మడు మహేష్ బాబు మరియు త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న సినిమా లో సెకండ్‌ హీరోయిన్ పాత్రలో కనిపించబోతుంది.త్రివిక్రమ్‌ సినిమా అంటే సెకండ్‌ హీరోయిన్ కు మినిమం ప్రాముఖ్యత ఉండదు.అయినా కూడా ఎలా ఈ సినిమా లో శ్రీ లీలా నటించేందుకు ఓకే చెప్పిందో అర్థం కావడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ముక్కున వేలేసుకుంటున్నరు.

Advertisement

హీరోయిన్‌ గా వరుసగా ఆఫర్లు వస్తున్న ఈ సమయం లో సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.అన్ని వర్గాల ప్రేక్షకుల యొక్క అభిమానం ను చాటుకుంటున్న ఈ అమ్మడు ఇప్పుడు హీరోయిన్‌ గా బిజిగా ఉంది.

మహేష్ బాబు యొక్క సినిమా అయినంత మాత్రాన సెకండ్‌ హీరోయిన్ అయినా పర్వాలేదు అంటూ ఓకే చెప్పడం విడ్డూరంగా ఉంది అంటూ విమర్శలు వస్తున్నాయి.శ్రీ లీలా కన్నడం లో సినిమా లు చేస్తుంది కానీ ఎక్కువగా తెలుగు లో ఆమె ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు