స్టార్‌ ఇమేజ్‌ దక్కించుకున్న తెలుగమ్మాయి

తెలుగు హీరోయిన్‌ శ్రీదివ్య తమిళంలో వరుస చిత్రాలతో దూసుకు పోతున్న విషయం తెల్సిందే.

చిన్న హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారి పోయిన ఈ అమ్మడు తాజాగా మరో మెట్టు పైకి ఎక్కి స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

ఈ అమ్మడు తాజాగా తమిళ స్టార్‌ హీరో కార్తీ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవలే కార్తీ ఈ అమ్మడితో జత కట్టేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

గోకుల్‌ దర్శకత్వంలో కార్తీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించబోతున్న సినిమా ‘కాష్మోర’.ఈ సినిమాలో కార్తీ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు.

దాంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.ఇద్దరు హీరోయిన్‌లు ఈ సినిమాలో నటించనున్నారు.

Advertisement

నయనతార, శ్రీదివ్యలు కార్తీకి జోడీగా నటించేందుకు ఎంపిక అయినట్లుగా దర్శకుడు గోకుల్‌ చెప్పుకొచ్చాడు.ఈ సినిమా త్వరలో షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

మొదటి సారి స్టార్‌ హీరోతో నటించే అవకాశం రావడంతో శ్రీదివ్య ఫుల్‌ హ్యాపీగా ఉంది.శ్రీదివ్య తెలుగులో కూడా నానితో ఒక సినిమాకు కమిట్‌ అయ్యింది.

మొత్తంగా శ్రీదివ్య హీరోయిన్‌గా దూసుకు పోతుంది.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు