Siva Karthikeyan, Srileela : కుర్చీ మడతబెట్టి పాటకు ఊరమాస్ స్టెప్పులు వేసిన శివ కార్తికేయన్, శ్రీలీల.. మామూలు టాలెంట్ కాదంటూ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీ లీల( Sri Leela ) కలిసి నటించిన గుంటూరు కారం సినిమా( Guntur Karam movie ) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

ఇక ఈ సినిమా ఎంత హిట్ అయిందో అంతకంటే ముందు పాటలు బాగా హిట్ అయ్యాయి.గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి సాంగ్ ( Kurchi matatabetti song )అయితే బాగా వైరల్ అయింది.

ఈ పాట యూట్యూబ్లో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.యూట్యూబ్ లో మాత్రమే కాకుండా ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ఎక్కడ చూసినా కూడా కొద్ది రోజులు ఈ పాట మారు మోగిపోయింది.

కుర్చీ మడతబెట్టి అనే ఒక వైరల్ పదం తీసుకొని దాంతో స్పెషల్ సాంగ్ రాయగా థమన్( Thaman ) ఇచ్చిన ఫాస్ట్ మ్యూజిక్ బీట్స్, శ్రీలీల, మహేష్ సినిమాలో వేసిన స్టెప్పులకు థియేటర్స్ దద్ద రిల్లాయి.థియేటర్స్ లో మహేష్, శ్రీలీల మాస్ స్టెప్పులు చూసి అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.ఆ స్టెప్పులు కూడా వైరల్ అవ్వడంతో బయట, ఈవెంట్స్ లో, కాలేజీ ఫంక్షన్స్ లో, రీల్స్ లో ఎక్కడ చూసినా కుర్చీ మడతబెట్టి స్టెప్పులు సందడి చేసాయి.

Advertisement

ఇది ఇలా ఉంటే ఈ కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ కి ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.

తాజాగా కుర్చీ మడతబెట్టి సాంగ్ కి శ్రీలీల, తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్( Siva Karthikeyan ) కలిసి స్టేజిపై స్టెప్పులు వేయడంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి.తమిళనాడు తిరుచిరప్పల్లికి దగ్గర్లోని ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీలో జరిగే అనంతర కల్చరల్ ఫెస్ట్ కి ఆదివారం మార్చ్ 23 రాత్రి శివకార్తికేయన్, శ్రీలీల హాజరయ్యారు.ఈ ఈవెంట్లో శ్రీలీల, శివకార్తికేయన్ కలిసి స్టేజిమీద కుర్చీ మడతబెట్టి సాంగ్ కి స్టెప్పులు వేశారు.

అక్కడి స్టూడెంట్స్ కూడా ఫుల్ జోష్ లో ఈ సాంగ్ కి డ్యాన్స్ వేశారు.దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి.ఇక శ్రీలీల, శివకార్తికేయన్ రావడంతో అక్కడి స్టూడెంట్స్ ఫోటోల కోసం ఎగబడ్డారు.

స్టేజిపై శ్రీలీల, శివకార్తికేయన్, యాంకర్స్ కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నారు.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు