అమరావతి: పర్యాటక, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.క్రీడాకారులను ప్రాత్సహించేందుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందిస్తుంది.
రాష్ట్రంలో 13 జిల్లాల్లోనూ సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం.మార్చి 31 లోపు మిగిలిన జిల్లాల్లో సీఎం కప్ టోర్నమెంట్ పూర్తి చేస్తాం.
ప్రతి గ్రామంలో ప్లేగ్రౌండ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.గ్రామీణ అభివృద్ది శాఖ ద్వారా ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో ప్లే గ్రౌండ్లను అభివృద్ది చేస్తాం.
రాష్ట్రంలో 185 కోట్లతో శాప్ ద్వారా క్రీడా ప్రాంగణాలు అభివృద్ది చేస్తున్నాం.6 గురుకుల పాఠశాలల్లో క్రీడా విభాగాలు ఏర్పాటు చేస్తున్నాం.త్వరలో మిగిలిన గురుకులాల్లో క్రీడా విభాగాలు ప్రారంభిస్తాం.రాష్ట్రంలో 13 క్రీడా ప్రాంగణాలను ను పీపీపీ మోడ్ లో అభివృద్ది చేసేందుకు ప్రతిపాదనలను సీఎంకు పంపించాం.సీఎం ఆమోదం అనంతరం అభివృద్ది పనులు చేపడతాం.