తెలంగాణ రాజకీయాలు అధికార ప్రతిపక్ష పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలకు తోడు ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో హాట్ హాట్ గా మారడమే కాకుండా ఏ క్షణం ఎటువంటి నిర్ణయం వెలువడనుంది అనే ఆసక్తికర పరిస్థితులు నేడు నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి.ఎందుకంటే తాజాగా అమిత్ షాను కలిసిన తరువాత బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను చూస్తే ఏదో తెర వెనుక భారీ కార్యాచరణ జరగబోతోందని తెలుస్తోంది.
ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల లాగానే అకస్మాత్తుగా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తే రాజకీయ పార్టీగా బీజేపీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అమిత్ షా బీజేపీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.
అయితే ముందస్తు ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నుండి ఎటువంటి స్పందన రానప్పటికీ ఇది ఒక రాజకీయ వ్యూహం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే గత ఎన్నికల్లో లాగా టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా లేదు.ఎందుకంటే ప్రస్తుతం టీఆర్ఎస్ పై అనుకూల వాతావరణం కన్నా వ్యతిరేక వాతావరణం ఎక్కువగా ఉన్న తరుణంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదు.
అయితే నిరుద్యోగులకు నోటిఫికేషన్ లను విడుదల విషయంలో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్న తరుణంలో ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేయకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదు.ఒకవేళ వెళ్తే నిరుద్యోగుల ఆగ్రహం ప్రభావం ఎన్నికల మీద పడే అవకాశం ఉంది.
ఎందుకంటే గత కొన్నేళ్లుగా నిరుద్యోగులు నోటిఫికేషన్ కొరకు కళ్ళకు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న తరుణంలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపడితేనే వచ్చే ఎన్నికల్లో ఎన్నికలను ఎదుర్కొనే అవకాశం ఉంది.లేకపోతే టీఆర్ఎస్ పార్టీ భారీ ఓటమిని చవి చూడక తప్పదని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.