భారతదేశంలో ఎవ్వరికీ దక్కని గౌరవం భానుమతి సొంతం.. ఏంటంటే..?

భానుమతి( Bhanumathi ), ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది.

ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ వంటి దిగ్గజ నటులు సైతం ఆమె ముందు నటనలో తేలిపోయేవారు.ఈ తార గొప్ప నటి మాత్రమే కాదు ఎవరికీ భయపడని ధీశాలి, ముక్కుసూటి మనిషి.

భానుమతి నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా, రచయిత్రిగా, స్టూడియో ఓనర్‌గా.ఇలా అన్ని సినీ డిపార్ట్‌మెంట్స్‌లో రాణించింది.1925, సెప్టెంబర్‌ 7న ప్రకాశం జిల్లా దొడ్డవరంలో జన్మించింది భానుమతి.ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్.తండ్రి దగ్గర ఆమె మ్యూజిక్ నేర్చుకుంది.14 ఏళ్ల వయసులోనే ఆమెకు "వరవిక్రయం" సినిమాలో నటించే అవకాశం వచ్చింది.అందులో నటించడానికి ఆమె తండ్రి కొన్ని షరతులు పెట్టారు.

అవేంటంటే భానుమతిని మేల్ యాక్టర్స్ టచ్ చేయకూడదు, హగ్, కిస్ లాంటివి అసలే ఉండకూడదు.ఈ కండిషన్స్‌కు మూవీ టీమ్ ఒప్పుకోవడంతో భానుమతి సినిమాల్లోకి వచ్చింది.

Advertisement

అవే కండిషన్లతో చాలా సినిమాలు చేసింది.ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు పాటలు పాడుతూ ఆకట్టుకుంది.సంగీతం కూడా కంపోజ్ చేసింది.19వ ఏట రైటర్‌గా మారి ఆశ్చర్యపరిచింది.

ఆమె రాసిన "అత్తగారి కథలు( Attagari Kathalu )" రచనకు పద్మశ్రీ అవార్డు లభించింది.అయితే ప్రొఫెషనల్ లైఫ్ ఎంతో సక్సెస్ సాధించిన ఆమెకు సంతృప్తిగా లభించలేదు.తనకంటూ ఒక ఓన్ ఫ్యామిలీ లీడ్ చేయాలని ఎప్పుడూ ఉండేది.

ఆమె ఇండిపెండెంట్‌ ఉమెన్ అని చెప్పుకోవచ్చు.ఎవరైనా తనని హర్ట్ చేసేలాగా ప్రవర్తిస్తే ఆమె క్షమించేవారు కాదు.

ఓసారి తమిళ దర్శకుడు షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమెను "భానుమతి ఇలా రావే" అన్నాడట.దాంతో "ఏంట్రా పిలిచావు" అని ఆమె అంటూ అతడి చెంప చెల్లుమనిపించినట్లు మాట్లాడిందట.

ఎంతమంది చేరినా తెలంగాణ లో టీడీపీకి కష్టమేనా   ?  
బిస్లరీ సంస్థను అమ్ముకుందామనుకున్న ఫౌండర్.. ఆయన కూతురు రంగంలోకి దిగడంతో..?

అప్పటినుంచి భానుమతిని దర్శకులందరూ గౌరవించి మాట్లాడేవారని అంటారు.ఈ కారణంగానే ఆమెకు ఫైర్ బ్రాండ్ అనే పేరు వచ్చింది.

Advertisement

ఇలాంటి మనస్తత్వంతో ఆమె చాలా మంచి అవకాశాలు కూడా పోగొట్టుకున్నారు.ముఖ్యంగా మిస్సమ్మ సినిమా( Missamma )లో హీరోయిన్ ఛాన్స్ పోగొట్టుకుంది.అయినా దానికి ఆమె బాధపడలేదు.

తాను తప్పుకోవడం వల్లే సావిత్రి లాంటి గొప్ప నటి పరిచయం కాగలిగిందని సంతృప్తి పడింది.హీరోయిన్‌గా ఆమె ఎన్నో సినిమాలు చేశాక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది.

తాతమ్మకల, గడసరి అత్త సొగసరి కోడలు, మంగమ్మగారి మనవడు, బామ్మమాట బంగారు బాట తదితర సినిమాల్లో ఆమె అద్వితీయమైన నటనా ప్రతిభను కనబరిచింది.కెరీర్ మొత్తంలో ఆమె లెక్కలేనని అవార్డులను దక్కించుకుంది.

భానుమతి మొత్తంగా మూడు నేషనల్ అవార్డులు, ఓ పద్మశ్రీ అవార్డు, ఓ కలైమామణి అవార్డు, ఓ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నది.ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలు డాక్టరేట్లతో భానుమతిని సత్కరించాయి.

ఆమె లాస్ట్ మూవీ పెళ్లికానుక (1998).ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకుంది.80 ఏళ్ళ వయసులో 2005 డిసెంబర్‌ 24న మరణించింది.అయితే బహుముఖ ప్రజ్ఞాశాలిగా భానుమతికి భారతదేశ వ్యాప్తంగా లభించిన గౌరవం మరెవ్వరికీ దక్కలేదు.

తాజా వార్తలు