గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల( Garidepalli ) కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ( SP Sunpreet Singh ) ఆకస్మిక తనిఖీ చేశారు.

దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను,రికార్డులను ఆయా మండలాల సంబంధించిన సమస్యాత్మక గ్రామాలపై ఎస్పీ ఆరా తీశారు.

పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను, నేరాలు జరుగుతున్న తీరును ఎస్ఐను అడిగి తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా జరుగుతున్న సంఘటనలు వాటిపై నమోదైన కేసులు వాటిని అదుపు చేసే విషయంలో తీసుకున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో అతిపెద్ద రెండవ మండలమైన గరిడేపల్లిలో పోలీస్ సిబ్బంది తక్కువగా ఉన్నారని ఎస్పీ దృష్టికి విలేకరులు తీసుకురాగా పరిశీలిస్తామని తెలిపారు.రాజకీయ చైతన్యవంతమైన గ్రామాలు చాలా ఉన్నాయని,ఇటీవల కొన్నిచోట్ల దొంగతనాలు జరిగాయని విలేకరులు అడగగా నేరాలు, దొంగతనాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి, హుజూర్ నగర్ సిఐ చరమందరాజు,గరిడేపల్లి ఎస్ఐ ఈట సైదులు, ఏఎస్ఐ రాములు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు : కలెక్టర్

Latest Suryapet News