త్వరలో రామ మందిర నిర్మాణంకు శంకుస్థాపన

అయోధ్యలోని వివాదాస్పద భూమిని అయోధ్య బోర్డుకు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు తుది తీర్పును ఇచ్చిన నేపథ్యంలో రామ మందిర నిర్మాణంకు మార్గం సుగమం అయ్యింది.

గత కొన్ని రోజులుగా బీజేపీ నాయకులు మరియు హిందుత్వ వాదులు చెబుతున్నట్లుగా అతి త్వరలోనే ఒక మంచి రోజున రామ మందిర నిర్మాణంకు శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

ముస్లీంలు కూడా మసీదును అయోధ్యలోనే నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయబోతుంది.హిందూ మరియు ముస్లీంల మద్య ఎలాంటి వివాదం, గొడవలు లేకుండా రామ మందిరం మరియు మసీదు నిర్మాణంకు ఒకే సారి ఏర్పాట్లు ప్రారంభించాలనే డిమాండ్‌ కూడా వస్తుంది.

ఏది ఏమైనా ఇది ఒక మంచి తీర్పు అని, ఇందులో ఏ ఒక్కరి విజయం, ఏ ఒక్కరి పరాజయం లేదు అంటూ ప్రముఖులు చెబుతున్నారు.ముస్లీంలు కూడా ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై ఎలర్ట్‌ ప్రకటించారు.ఎక్కడ కూడా చిన్న పాట సంఘటనలు కూడా జరుగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కడుతుండగానే మూడోసారి కూలిపోయిన వంతెన..

తాజా వార్తలు