కొంత మంది ఎమ్మేల్యేలు ప్రలోభాలకు గురి అయ్యారు..సజ్జల రామకృష్ణా రెడ్డి

కొంత మంది ఎమ్మేల్యేలు ప్రలోభాలకు గురి అయ్యారు.క్రాస్ ఓటింగ్ లో పాల్గొన్న వారిపై పార్టీ అంతర్గత విచారణ జరిపింది.

క్రాస్ ఓటింగ్ వ్యవహారంపై సీఎం జగన్ తో పాటు క్రమ శిక్షణ కమిటితో చర్చించాము.నలుగురు ఎమెల్యేలను సస్పెండ్ చేయాలని నిర్ణయించాం.

సీట్లు ఇవ్వము అని చివరి వరకు మేము మభ్య పెట్టము.వీరిపై నివేదికలు తెప్పించి టికెట్ ఇవ్వడం కుదరదని ముందే చెప్పాం నలుగురు ఎమెల్యేలు పార్టీ కార్యక్రమాల్లో వెనకబడి ఉన్నారు.

కోట్లాది రూపాయలు వెచ్చించి చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు.నాయకులూ అనే వాళ్ళు అధినేత నిర్ణయానికి పార్టి నిర్మాణంకు కట్టుబడి ఉండాలి.

Advertisement

టిడిపితో వెళ్ళాలి అనుకుంటే బహిరంగంగా వెళ్లొచ్చు .ఇలా సొంత పార్టీకి ద్రోహం చేయాల్సిన అవసరం లేధు.అపోహలు ఉంటే తొలగించే వాళ్ళం పార్టీ నిర్ణయాన్ని దిక్కరిస్తే ఉపెక్షించం.

ఇది చిన్న విషయం కాదు పార్టీకి సంబంధించి లైన్ దాటితే ఇలాగే ఉంటుంది.వైసీపీ ఒక విధానం ఉంటుంది అధి ఎంటో అందరికీ తెలియాలి.

టికెట్ ఇవ్వకుండా తప్పించిన అంత మాత్రాన వారికి భవిష్యత్ లేనట్లు కాదు.అసంతృప్తి ఉంటే పార్టీలో ఉండొచ్చు పార్టీ నేతలకు చెప్పొచ్చు.

టికెట్ లేకపోతే రాజకీయా భవిషత్ సీఎం చూసుకుంటా అని అందరికీ చెప్పారు.ఎన్నికలకు సంవత్సరం ముందే టీడీపీలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలోకి వెళ్ళడానికి కారణాలు డబ్బు కాకుండా ఏముంటాయి.వాళ్లు డబ్బులు తీసుకున్నారు అనడానికి ఆధారాలు లేవు.

Advertisement

అమ్ముడు పోకుండా మరి టీడీపీకి ఓటు ఎందుకు వేస్తారు.టీడీపీకి అమ్మడం కొనడం అలవాటే.

సజ్జల రామకృష్ణా రెడ్డి.వైసీపీ జనరల్ సెక్రటరీ.

తాజా వార్తలు