ప్రపంచంలోని ఐదు వింత లైబ్రరీలు

పుస్తకాలు మనిషికి మంచి స్నేహితుడిగా పరిగణిస్తారు.పుస్తకాల ల‌భ్య‌త‌ను సులభతరం చేయడానికి లైబ్రరీలు దోహ‌ద‌ప‌డ‌తాయి.

ఈ నేప‌ధ్యంలో కొన్ని వింత లైబ్రెరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 వెండింగ్ మెషిన్ లైబ్రరీ

వెండింగ్ మెషిన్ అంటే డబ్బు అందించ‌డం ద్వారా వస్తువులు బయటకు వచ్చే యంత్రం.పాల యంత్రం, ఏటీఎం, శీతల పానీయం వెండింగ్ మెషిన్ మొదలైనవి.

కాలిఫోర్నియాలోని ఈ లైబ్రరీని వెండింగ్ మెషీన్ మాదిరిగా రూపొందించారు.ఈ లైబ్రరీ 24 గంటలూ తెరిచే ఉంటుంది.

2 ఒంటెపై లైబ్రరీ

కెన్యాలో "ఒంటె లైబ్రరీ" బాగా ప్రాచుర్యం పొందింది.నిజానికి ఈ దేశంలో పుస్తకాలు చేరవేసే పని ఒంటెల ద్వారానే జరుగుతుంది.

ఈ విధంగా 1980లలో ఒంటెలపై పుస్తకాలు అందించే పని మొదలైంది.పుస్తకాలను పెట్టెల్లో నింపి ఒంటెల ద్వారా రవాణా చేస్తారు.

3 లైబ్రరీ షిప్

ఈ లైబ్రరీ నార్వేజియన్ రాష్ట్రం హోర్డోలాండ్‌లోని ఓడపై నిర్మిత‌మ‌య్యింది.దీనిలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుండి ఏప్రిల్ వరకు ఓడలో సుమారు 6000 పుస్తకాలు ఉంచుతారు.

ఈ పుస్తకాలు దాని చుట్టుపక్కల ద్వీపాలలో నివసిస్తున్న సుమారు 250 సంఘాలకు పంపిణీ చేస్తారు.ఈ నౌకలో కెప్టెన్, 2 లైబ్రేరియన్, మరో ఇద్ద‌రు సిబ్బంది ఉంటారు.

4 మెయిల్‌బాక్స్ లైబ్రరీ

Advertisement

ఈ రకమైన లైబ్రరీ సాధారణంగా ఇంగ్లాండ్, ఐరోపాలో కనిపిస్తుంది.పార్కులు, వీధులు వంటి బహిరంగ ప్రదేశాల్లో నిర్మించిన ఈ లైబ్రరీలో పాఠ‌కులు తాము చదివిన పుస్తకాన్ని ఉంచుతారు.కొత్త పుస్తకాన్ని తీసుకుంటారు.

5 లైబ్రరీ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్

అర్జెంటీనాలోని ఈ లైబ్రరీ దేశ చీకటి చరిత్రను ప్రతిబింబిస్తుంది.ఈ లైబ్రరీ ట్యాంక్ ఆకారంలో తయారు చేశాఉ.

ఇందులో 900 పుస్తకాలు ఉన్నాయి.ఈ లైబ్రరీ అర్జెంటీనా స్వాతంత్య్ర‌ పోరాటానికి సంబంధించిన చారిత్రక సేకరణను చూపిస్తుంది.

ఈ లైబ్రరీ ముఖ్య ఉద్దేశ్యం అర్జెంటీనాలోని లైబ్రరీలు లేని చిన్న పట్టణాలకు చేరుకోవడం.

మీకు ఎక్కువగా చెమటలు పడుతున్నాయా..? అయితే గుండెపోటు వచ్చే అవకాశం..!
Advertisement

తాజా వార్తలు