నీకు సెట్‌ అవ్వలేదు... 'బెస్ట్‌' పై తెలుగు నెటిజన్స్‌ ట్రోల్స్‌

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ అభిమానులకు మరియు తెలుగు స్టార్‌ హీరోల అభిమానులకు ఎప్పుడు కూడా విభేదాలు గొడవలు ఉంటూనే ఉంటాయి.

ఈ విషయంలో ఎప్పటికప్పుడు వారి మద్య నెట్టింట జరిగే వార్‌ చిన్నది కాదు.

చాలా సార్లు ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరో మీద.ఈ హీరో ఫ్యాన్స్ ఆ హీరో మీద ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.తాజాగా మరో సారి తమిళ స్టార్‌ హీరో విజయ్ మరియు తెలుగు నెటిజన్స్ మద్య నెట్టింట వార్‌ జరుగుతోంది.

తెలుగు నెటిజన్స్‌ చేస్తున్న ట్రోల్స్‌ ను తీవ్రంగా ప్రతిఘటించేందుకు విజయ్‌ అభిమానులు ప్రయత్నాలు చేస్తున్నారు.విజయ్ ప్రస్తుతం నటిస్తున్న బెస్ట్‌ సినిమా కు సంబంధించిన విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

Social Media Trolls On Vijay Movie Beast,latest Viral Movie News

బెస్ట్‌ అనే టైటిల్ నీకు సెట్‌ అవ్వదు అంటూ కొందరు నెటిజన్స్ విజయ్‌ ను మరియు ఆయన అభిమానులను ట్యాగ్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.తెలుగు స్టార్స్‌ ప్రభాస్‌ లేదా మహేష్‌ బాబు కు అయితేనే ఆ టైటిల్‌ సెట్‌ అవుతుందని.బెస్ట్‌ అంటే ది బెస్ట్‌ గా ఉండాలి.

Advertisement
Social Media Trolls On Vijay Movie Beast,latest Viral Movie News-నీకు �

విజయ్ కు అది ఎలా సెట్‌ అవుతుందని కొందరు ట్రోల్‌ చేస్తున్నారు.ప్రభాస్‌ సాహో మరియు రాధే శ్యామ్‌ లుక్‌ లను షేర్‌ చేస్తూ ఇది బెస్ట్‌ అంటే అంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలకు విజయ్‌ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

తెలుగు మరియు అరవ అభిమానుల జరుగుతున్న ఈ చర్చ మరింత ముదురుతోంది.వ్యక్తిగత దూషణల నుండి మొదలుకుని పాత విషయాలను తోడుకునే వరకు వెళ్లింది.

ప్రస్తుతం నెట్టింట బెస్ట్‌ పోస్టర్‌ మరియు విజయ్‌ బర్త్‌ డే విషెష్‌ ట్రెండ్ అవుతుంది.ఇదే సమయంలో ఈ వివాదం కూడా ట్రెండ్‌ అవుతున్నట్లుగా నెటిజన్స్ చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు