అన్న కంటే తమ్ముడు బెటర్ గా ఉన్నాడే.. హిట్‌ కొట్టేలా ఉన్నాడు

టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖ హీరోలతో సినిమాలను నిర్మించి ఒకప్పుడు స్టార్ నిర్మాతగా పేరు దక్కించుకున్న బెల్లంకొండ సురేష్ ఇప్పుడు సినిమాల నిర్మాణం కు దూరంగా ఉంటున్నాడు.

కానీ ఆయన కొడుకులు ఇద్దరు కూడా హీరోలుగా పరిచయం అయ్యారు.

ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా పరిచయమై వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు.అయితే ఇప్పటి వరకు కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అనేది ఈ బెల్లంకొండ హీరోకి దక్కలేదు.

ఇప్పుడు ఆయన తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.త్వరలోనే గణేష్ నటించిన స్వాతి ముత్యం సినిమా ప్రేక్షకుల ముందు రాబోతుంది.

తాజాగా సినిమా కు సంబంధించిన టీజర్‌ విడుదల అయింది.గణేష్‌ బర్త్‌ డే సందర్భంగా విడుదలైన ఆ వీడియోలో గణేష్ నటనకి మంచి మార్కులు పడుతున్నాయి.

Advertisement

పలు సినిమాలను చేసిన సాయి శ్రీనివాస్ కంటే గణేష్ నటన చాలా బాగుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.స్వాతిముత్యం సినిమా తో కచ్చితంగా గణేష్ మంచి మార్కులు దక్కించుకోవడంతో పాటు టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోల సరసన నిలిచే అవకాశం ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

స్వాతిముత్యం సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 5వ తారీకున విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.చూడడానికి ఇన్నోసెంట్ అన్నట్లుగా కనిపిస్తున్నాడు.

అంతే కాకుండా మాస్ సన్నివేశాలకు సరిగ్గా సెట్ అవుతాడు అని కూడా అనిపిస్తుంది.అందుకే బెల్లంకొండ సాయి గణేష్ త్వరలోనే టాలీవుడ్ లో మంచి స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని.

అన్న కంటే తమ్ముడే బెటర్ గా ఉన్నాడు కనుక తమ్ముడితోనే ఎక్కువ సినిమాలు చేయాలని నిర్మాతలు ముందుకు వచ్చే అవకాశం ఉందని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.స్వాతిముత్యం సినిమా విడుదల కాక ముందే సాయి గణేష్ మరో సినిమాని మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

నేను స్టూడెంట్ ని సర్ అనే టైటిల్ తో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోల సరసన నిలిచి అవకాశం గణేష్ కి దక్కుతుంది.

Advertisement

తాజా వార్తలు