బాలిక మెడకు చుట్టుకున్న భయంకరమైన పాము.. చివరికి ఏమైందంటే..?

ఒక బాలిక మెడకు విషపూరితమైన పాము చుట్టుకుంది.అదేంటి పాము చూస్తేనే ఆమడ దూరం పారిపోతున్నారు.

అలాంటిది పాము మెడకు ఎలా చుట్టుకోగలుగుతుందనేగా మీ సందేహం.నిజానికి బాలిక చుట్టూ పాము చుట్టుకున్నది అర్ధరాత్రి సమయంలో.

అందరూ పడుకున్న వేళ ఈ పాము ఒకరి ఇంట్లోకి ప్రవేశించింది.తర్వాత కింద పడుకున్న ఒక బాలిక మెడకు చుట్టుకుంది.

అయితే నిద్ర నుంచి మేల్కొన్న తల్లి తన బిడ్డ మెడలో ఉన్న పాము ని చూసి షాక్ అయింది.వెన్నులో వణుకు పుట్టించే ఈ ఘటన మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలోని సెలూ మండలంలో జరిగింది.

Advertisement

ఆరేళ్ళ పాప నిద్రపోతుండగా ఆ పాప మెడకు ఒక పాము చుట్టుకుంది.ఈ భయానక దృశ్యం చూసి నివ్వెరపోయిన తల్లి వెంటనే కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారికి విషయం తెలియజేసింది.

కానీ చిన్నారిని పాము నుంచి వేరు చేయడానికి ఎవరు సాహసం చేయలేదు.ఒకవేళ అలా చేస్తే పాము కాటేసే ప్రమాదం ఉందని కొందరు వెనక్కి తగ్గారు.

దాంతో ఏకంగా గంటన్నరపాటు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.బిడ్డకు ఎలాంటి అపాయం జరగకూడదని అలాగే పడుకోమని చెప్పడం తప్ప కుటుంబ సభ్యులు ఏం చేయలేకపోయారు.

అయితే గంటన్నర తర్వాత పాము దానంతటదే చిన్నారి మెడ నుంచి వెళ్ళిపోవడం ప్రారంభించింది.ఈ క్రమంలోనే చిన్నారి పక్కకు తిరగడంతో పాము తోక నలిగింది.దాంతో ఆ పాము వెంటనే బాలికను కాటేసింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఇది గమనించిన కుటుంబ సభ్యులు బాలికను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.వెంటనే చికిత్స ప్రారంభించిన వైద్యులు బిడ్డ ప్రాణాలు కాపాడగలరు.

Advertisement

దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.తమ ప్రాంతంలో పాములు విచ్చలవిడిగా సంచరిస్తాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

వానాకాలం లో పాముల బెడద మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు.

తాజా వార్తలు