వారికే కరోనా ఎక్కువ సోకుతుందని నిర్ధారించిన WHO… జాగ్రత్త సుమా …!

ఎక్కడో చైనా లో మొదలైన కరోనా వైరస్ నేడు ప్రపంచం మొత్తం ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్పించి తగ్గే దాఖలాలు లేకుండాపోయింది.

దీంతో ప్రతి రోజు భారీ మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కొత్తగా నమోదు అవుతున్నాయి.ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా అమెరికా, బ్రెజిల్, రష్యా, భారతదేశం లో కరోనా కేసులు మారుమోగి పోతున్నాయి.

కేసులు ఇంత పెద్ద ఎత్తున నమోదవుతున్న మరోవైపు రికవరీ కూడా అలాగే కొనసాగుతుండడంతో ప్రజలు కాసింత ఊపిరి పీల్చుకుంటున్నారు.అయితే దురదృష్టవశాత్తు ఇందులో కొంతమంది కరోనా వైరస్ నుండి చేరుకోలేక మృత్యువాత పడుతున్నారు.

కరోనా బారిన పడి బాధ పడిన వారిలో ముఖ్యంగా మూత్రపిండాలు, గుండె, ఆస్తమా మొదలగు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.ఇకపోతే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మరణాలకు సంబంధించి మరో కీలక సమాచారాన్ని వెల్లడించింది.

Advertisement

WHO ప్రకారం కరోనా బారినపడి మృతి చెందిన వారిలో అత్యధిక శాతం పొగ తాగే వారే అని నిర్ధారణ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా నమోదయిన మరణాలను పోల్చి చూడగా చివరకు డబ్ల్యూహెచ్ఓ ఈ విషయాన్ని వెల్లడించింది.

అంతేకాదు పొగతాగేవారిలోనే ఎక్కువమంది ఈ కరోనా మహమ్మారికి గురవుతున్నారని అందులోనూ వారి మరణాలే అత్యధికంగా ఉన్నాయని స్పష్టం చేసింది WHO. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా నేటి వరకు దాదాపు రెండు కోట్ల చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఏకంగా 60 లక్షలకు పైగా మంది వైరస్ బారినపడి కోలుకున్న వారు ఉన్నారు.

అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారి దెబ్బకు 5 లక్షల పైగా ప్రజలు మరణించారు.ఇక మన భారతదేశంలో కూడా కరోనా కేసుల సంఖ్య ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానానికి చేరుకుంది.

ప్రస్తుతం దేశంలో ఆరు లక్షలు మించి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అయితే ఇప్పటికే ఈ వైరస్ మహమ్మారి నుండి మూడు లక్షలకు మించి రికవరీ అవ్వడంతో ప్రజలు ఒకింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఇక మరోవైపు కరోనా మహమ్మారి నుండి భారతదేశంలో ఇప్పటి వరకు 17 వేలకు పైగా ప్రజలు మరణించారు.

Advertisement

తాజా వార్తలు