స్మార్ట్‌వాచ్ కాదు, ఇది స్మార్ట్ వెడ్డింగ్ రింగ్.. దీనితో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే..

కొన్నేళ్ల క్రితం వరకు ఫోన్లనేవి మాట్లాడడానికి ఒక వస్తువుగా ఉపయోగపడేవి కానీ ఇప్పుడు అవి చాలా స్మార్ట్‌గా తయారయ్యి అన్ని పనులూ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి.

గడియారాలు కూడా స్మార్ట్‌గా మారిపోయి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి.

ఇప్పుడు వెడ్డింగ్ రింగ్‌ను( Wedding Ring ) కూడా స్మార్ట్‌గా మార్చేస్తే తప్పేముంది అని ఒక కంపెనీ ఆలోచన చేసింది.అంతేకాదు, తాజాగా దానిని లాంచ్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సాధారణంగా ఆభరణం వలె కనిపించే పెళ్లి ఉంగరాన్ని పేమెంట్స్( Payments ) చేయడానికి ఉపయోగించాలనే ఆలోచన ఎవరికీ రాదు.కానీ McLear అనే కంపెనీ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్‌తో ఉంగరాన్ని పేమెంట్స్ జరపడానికి ఉపయోగించేలా మార్చేసింది.

షాపింగ్ మాల్స్ లో స్వైప్ చేయడానికి ఉపయోగపడే ఈ స్మార్ట్ రింగ్‌ను( Smart Ring ) యూకేలో లాంచ్ చేసింది.దాని పార్ట్‌నర్ అయిన ట్రాన్స్‌కార్ప్‌తో కలిసి ఇండియాలో కూడా దీన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

Advertisement

McLear Ring స్మార్ట్‌ఫోన్ యాప్‌తో పని చేస్తుంది.ఇది క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ స్టోర్ చేయడానికి RFID టెక్నాలజీని ఉపయోగిస్తుంది.ఈ ఉంగరాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు.

ఏ వేలికైనా ధరించవచ్చు.పేమెంట్స్‌ చేయాలనుకున్నప్పుడు, క్రెడిట్ కార్డ్‌కి బదులుగా ఈ రింగ్‌ను పీఓఎస్ మెషీన్‌లో ట్యాప్ చేస్తే సరిపోతుంది.

రింగ్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి, పేమెంట్‌ను యాక్టివేట్ చేయడానికి యూజర్లు హ్యాండ్ సైన్ చేయాలి.యూజర్‌కు తెలియకుండా ఉంగరాన్ని ట్యాప్ చేసి డబ్బును ఇతరులు దొంగిలించకుండా ఈ ఫీచర్ ఆపుతుంది.

స్క్రాచ్-రెసిస్టెంట్, వాటర్‌ప్రూఫ్, హైపోఅలెర్జెనిక్ ఫీచర్లు కలిగి ఉన్న ఈ రింగ్‌ ఇండియాలో ఇంకా అధికారికంగా అందుబాటులో లేనప్పటికీ, యూకేకి చెందిన ఎవరైనా ఇప్పటికే వారి వీసా లేదా మాస్టర్ కార్డ్‌తో జత చేసిన రింగ్‌పేని కలిగి ఉంటే, వారు దానిని భారతదేశంలో ట్రాన్సాక్షన్ల కోసం ఉపయోగించవచ్చు.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

భారత్‌లో కంపెనీ భాగస్వామి అయిన ట్రాన్స్‌కార్ప్ రింగ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది.రింగ్ పేతో ట్రాన్సాక్షన్ల కోసం వారు Junio ​​యాప్, RuPayతో భాగస్వామ్యం కుదుర్చుకుంటారు.RFID టెక్నాలజీ ఉపయోగిస్తున్నందున ఈ రింగ్‌ను ఛార్జ్ చేయవలసిన అవసరం లేదు.

Advertisement

యూజర్లు తమ ఖర్చులను ట్రాక్ చేయడానికి, రింగ్ పోతే తక్షణమే లాక్ చేయడానికి కంపానియన్ యాప్ ఉపయోగించవచ్చు.ఇక మెక్‌లీర్ అనేక సంవత్సరాలుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో కలిసి పని చేస్తోంది.

త్వరలో ఇండియాలో రింగ్‌ను లాంచ్‌ చేయాలని తెగ ప్రయత్నిస్తోంది.

తాజా వార్తలు