మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన స్కంద సినిమా ( Skanda Movie ) మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుని రామ్ పోతినేని లోని మాస్ మొత్తాన్ని బయటపెట్టాడు బోయపాటి శ్రీను.
ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకొని ముందుకు పోతుంది.ఇక ఇందులో రామ్ పోతినేని సరసన సయీ మంజ్రేకర్, శ్రీ లీల ( Sreeleela ) కథానాయికలుగా చేశారు.ఇక ఏదైనా కొత్త సినిమా విడుదలయితే చాలు అందులో ఉన్న తెలియని నటీనటుల గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
అయితే తాజాగా విడుదలైన స్కంద సినిమా లో నటించిన ఓ అమ్మాయి గురించి కూడా ప్రస్తుతం నెట్టింట్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అనుకుంటున్నారా.
ఆమె ఎవరో కాదు స్కంద సినిమాలో సెకండ్ హాఫ్ లో రామ్ పోతినేని ( Ram Pothineni ) సిస్టర్ గా స్క్రీన్ పై కాస్త ఎక్కువ సేపు కనిపించిన అమ్మాయి.ఇక ఈమె చూడడానికి హీరోయిన్ మెటీరియల్ లాగా కనిపిస్తోంది.
ఇక ఆమె మొదటి సారి ఈ సినిమాలో కనిపించడంతో ఈమె ఎవరబ్బా అంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.ఇక ఆమె కూడా సోషల్ మీడియా బ్యూటీనే.మరీ ముఖ్యంగా మన తెలుగు అమ్మాయి.భీమవరానికి చెందిన అమృత చౌదరి ( Amrutha chowdary ) ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమాల్లో నటించాలని ఎప్పటినుండో ఎదురుచూస్తూ అవకాశం ఎప్పుడు వస్తుందా అని తిరుగుతుందట.ఇక ఇలాంటి సమయంలో అమృత చౌదరికి స్కంద సినిమా లో రామ్ పోతినేని సిస్టర్ గా( Ram Sister Role ) చేసే అవకాశం రావడంతో వెంటనే ఒప్పుకొని ఈ సినిమాలో చేసింది.ఇక అమృత చౌదరికి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
ఈమె జీన్స్ వేసినా,చీర కట్టినా లక్షల్లో లైకులు వస్తాయి.అలాగే అమృత చౌదరి స్కంద సినిమా కంటే ముందే కొన్ని కవర్ సాంగ్స్ అలాగే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో బోల్డ్ గా కూడా నటించింది.
ఇక స్కంద సినిమా ద్వారా అమృత చౌదరి ( Amrutha chowdary ) ఒక్కసారిగా వైరల్ అవ్వడంతో ఈమె గురించి చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియాలో వెతుకుతున్నారు.దాంతో సోషల్ మీడియాలో అమృత చౌదరి పేరు ట్రెండ్ అవుతుంది.ఇక ఈ సినిమాలో మంచి పాత్రలో నటించే అవకాశం రావడంతో మరిన్ని సినిమాల్లో అమృతా చౌదరికి అవకాశాలు వస్తాయని ఆమె అభిమానులు భావిస్తున్నారు.