చంద్రబాబుపై( Chandrababu Naidu ) అరెస్ట్ అంశం లో దేశవ్యాప్తంగా అనేకమంది స్పందిస్తున్నారు .ముఖ్యంగా రాజకీయ రంగం నుంచి సినిమా రంగం నుంచి అనేకమంది బాబు ద్వారా లబ్ధి పొందిన వారు గానీ ఆయన నాయకత్వాన్ని ఇష్టపడేవారు గానీ తమ బాధను వ్యక్తం చేస్తూ ఆయనకు మంచి జరుగుతుందన్న ఆశను వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇలాంటి క్లిష్ట సమయం లో ఆయన మంత్రివర్గ సహచరుడు మాజీ మున్సిపల్ శాఖామాత్యుడు నారాయణ( Narayana ) ఇంతవరకు కనిపించకపోవడం ఆసక్తికరం గా మారింది .అందుతున్న వార్తల ప్రకారం ఆయన ఇప్పటివరకూ ఏ ఒక్క మీడియా సమావేశంలో కూడా చంద్రబాబు అరెస్టును( Chandrababu Arrest ) ఖండించిన దాఖలా కనిపించలేదు.
ముఖ్యంగా బాబు ఇప్పుడు ఫేస్ చేస్తున్న అనేక కేసులకు సంబందించిన శాఖలుకు నారాయణ అప్పుడు మంత్రిగా ఉన్నారు, అమరావతి సి ఆర్ డి ఏ, మార్చ్డిగా సి ఆర్ డి రింగ్ రోడ్ అలైన్మెంట్స్ మార్పులు వంటివి ఆయన శాఖకు సంబంధించిన విషయాలు.అలాంటప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగలేదని , తమ నాయకుడిని అన్యాయం గా అరెస్ట్ చేశారని ఒక్క ప్రెస్ నోట్ కూడా ఆయన రిలీస్ చేయలే చంద్రబాబు అరెస్టుపై ఇంతవరకు ఆయన ఎటువంటి సంతాపాన్ని వ్యక్తం చేయలేదంటే అసలు తెరవెనక ఏం జరుగుతుంది ,
ఆయన ఎందుకు అదృశ్యం అయిపోయాడు అన్న అనుమానాలు తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తున్నాయి.అయితే మొదటి నుంచి పార్టీ జెండా పట్టుకున్న కార్యకర్తలకు న్యాయం చేయకుండా ఆర్థిక అండదండలు ఉన్నాయన్న కారణంతో బడా బాబులకు కార్పొరేట్ శక్తులకు అధికారాన్ని అప్పజెబితే వాళ్ళు కష్ట సమయాల్లో ఇలానే మొహం చాటేస్తారంటూ కూడా అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి అయితే నారాయణ వైసిపి( YCP ) కోవర్టుగా మారిపోయాడని, కోర్టులలో అప్రూవగా మారి తెలుగుదేశానికి ఇబ్బందులు సృష్టించబోతున్నాడు అంటూ కొంతమంది వాఖ్యానించడం గమనార్హం .